Insomnia: ఇన్‌సోమ్నియా అనేది నిద్రకు సంబంధించిన రుగ్మత. ఉన్న వారు నిద్ర లేకపోవడం, లేదా మేలుకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యతో బాధపడుతుంటారు. ఇన్‌సోమ్నియా ఉన్న వారు నిద్ర లేమితో రాత్రంతా గడుపుతారు. లేదా నిద్రలో ఉండగానే తరచూ మేలుకుంటూ ఉంటారు. దీంతో విశ్రాంతి దొరక్క శారీరకంగానే కాకుండా మానసికంగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. ఇన్‌సోమ్నియా కారణంగా చిటికి మాటికి చిరాకు, కోపం రావడం లాంటివి కూడా సంభవిస్తాయి.
Insomnia is a Insomnia రకాలు
1. తాత్కాలిక ఇన్‌సోమ్నియా (Acute insomnia)
- కొన్ని వారాల పాటు మాత్రమే ఉండే నిద్ర సమస్యలు
- ఒత్తిడి లేదా దైనందిక జీవితంలో వచ్చిన సమస్యల కారణంగా ఇవి తాత్కాలికంగా ఉంటాయి.
2. తీవ్ర ఇన్‌సోమ్నియా (Chronic insomnia)
- వారానికి కనీసం మూడు రోజులు ఉంటుంది. మూడు నెలలపాటు కొనసాగుతుంది.
3. ఆరంభ ఇన్‌సోమ్నియా (Onset insomnia)
- నిద్రలోకి వెళ్లడంలో ఇబ్బందికరంగా ఉంటుంది.
- కాఫీ తాగడం, మానసిక ఆరోగ్య సమస్యలు లేదా ఇతర సాధారణ కారణాలు దీనికి కారణం కావచ్చు.
4. మ్యాంటెనెన్స్ ఇన్‌సోమ్నియా (Maintenance insomnia)
- నిద్రపోయిన తర్వాత మెలకువ వచ్చి మళ్లీ నిద్రపోవడం ఇబ్బందికరంగా ఉంటుంది.
- దీనికిక ఆరోగ్య సమస్యలు లేదా ఆందోళన కారణం కావచ్చు.
5. చిన్నారుల ఇన్‌సోమ్నియా (Behavioral insomnia of childhood)
- చిన్నపిల్లలు నిద్రపోవడం నిరాకరించడం లేదా నిద్రలోకి వెళ్లడంలో ఇబ్బంది పడటం దీని లక్షణాలు.
Insomnia కారణాలు
ఇన్‌సోమ్నియాకు అనేక కారణాలు ఉన్నాయి. అవి వేర్వేరు రకాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, దైనందిన జీవితంలో అనుకోకుండా ఏదైనా సమస్య ఎదురైనప్పడు లేదా దీర్ఘకాలిక అనారోగ్యం, శారీరక నొప్పులు, జీవక్రియ సమస్యలు, స్లీప్ ఆప్నియా లాంటి రుగ్మతలు దీని కారణాలు కావచ్చు.
కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు
1. వయస్సు : వృద్ధులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
2. లైంగిక దశలు : మెనోపాజ్ సమయంలో ఇన్‌సోమ్నియా అధికంగా కనిపిస్తుంది.
3. గర్భధారణ : గర్భిణుల్లో మానసిక, శారీరక మార్పులు దీనికి కారణం కావచ్చు.
4. శారీరక చురుకుదనం లోపం : జీవనశైలిలో మార్పు దీనికి కారణం కావచ్చు.
గర్భర్భస్థ సమయంలో…
గర్భిణులు ముఖ్యంగా మొదటి, మూడవ త్రైమాసికాల్లో ఇన్‌సోమ్నియాతో బాధపడతారు. సమతుల ఆహారంతో దీన్ని తగ్గించుకోవచ్చు. నిర్దిష్ట సమయంలో నిద్రపోవడం, ధ్యానం, యోగా చేయడం లాంటివి పాటించాలి.
పిల్లలు, టీనేజర్స్‌లో Insomnia
చిన్నారులు, కౌమార దశలో ఉన్నవారిలో ఇన్‌సోమ్నియా సమస్యలు కనిపించవచ్చు. నిద్ర లేకపోవడం, చిరాకు లేదా ప్రవర్తనలో మార్పులు, చదువుపై దృష్టి పెట్టకపోవడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. ఇది తగ్గాలంటే ఒకే సమయానికి నిద్రకు అలవాటు చేయాలి. నిద్రపోయే ప్రదేశంలో ప్రశాంత వాతావరణం ఉండాలి.
ఇన్‌సోమ్నియా .. నివారణ
- ఇన్‌సోమ్నియాను పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా మంచి నిద్ర కల్పించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి
- ఒకే సమయానికి నిద్రపోవడం, సమయానికి మేల్కొనడం.
- నిద్రకు ముందు శాంతమయ వాతావరణం కల్పించడం.
- రాత్రిళ్లు కాఫీ లేదా ఆల్కహాల్ సేవనం లాంటి అలవాటును తగ్గించుకోవడం.
చివరిగా చెప్పేదేమిటంటే..
ఇన్‌సోమ్నియా అనేది శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపొచ్చు. వైద్య నిపుణుల సలహాతో ఈ రుగ్మత నుంచి బయటపడొచ్చు.