New Alzheimer’s diagnosis : వైద్య శాస్త్రంలో మరో కీలక ముందడుగు పడింది. అల్జీమర్స్‌ను గుర్తించేందుకు, ఆ వ్యాధి ఏ దశ (Alzheimer’s disease stages)లో ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన రక్త పరీక్ష (Alzheimer’s blood test)ను అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ మెడిసిన్ (WashU Medicine) పరిశోధకులు అభివృద్ధి చేశారు.
అల్జీమర్స్ వ్యాధి అంటే ఏమిటి?
అల్జీమర్స్ అనేది డిమెన్షియా (dementia) అనే మతిమరపు వ్యాధిలో ఒక ప్రధాన రూపం. ఇది మెదడు నరాలను ప్రభావితం చేస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఆలోచనా విధానం మారిపోవడం లాంటి సమస్యలను కలిగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 55 మిలియన్ల మందికి పైగా ఈ వ్యాధి (Alzheimer’s disease)తో బాధపడుతున్నారు.
కొత్త రక్తపరీక్ష గురించి
ఇప్పటికే అల్జీమర్స్ (Alzheimer)ను గుర్తించేందుకు రక్త పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. మెదడు స్కానింగ్, మెమొరీ టెస్టులు లాంటివి ఉపయోగించబడుతున్నాయి. అయితే.. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ రక్త పరీక్ష ద్వారా ఒక వ్యక్తికి అల్జీమర్స్ ఉందో లేదో మాత్రమే కాకుండా వ్యాధి ఎంత తీవ్రంగా ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఈ పరీక్ష MTBR-tau243 అనే ప్రోటీనును గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రోటీన్ మెదడులో ఏర్పడే టౌ (Tau) తంతుజాలాల (tangles) రూపంలో కనిపిస్తుంది. వీటిని గుర్తించడం ద్వారా వ్యాధి ఎంత అభివృద్ధి చెందిందో డాక్టర్లు నిర్ణయిస్తారు.
శాస్త్రవేత్తల అధ్యయన వివరాలు
ఈ రక్త పరీక్షను మూడు ప్రధాన దశల్లో ఉన్న రోగులపై పరిశీలించారు.
- ప్రాథమిక దశ (అతిగా లక్షణాలు కనిపించని దశ)
- ప్రారంభ దశ (స్వల్ప జ్ఞాపకశక్తి లోపం)
- ప్రగతిశీల దశ (డిమెన్షియా స్పష్టంగా కనిపించే దశ)
- ఆల్జీమర్స్ ఉన్న రోగుల్లో MTBR-tau243 స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.
- ప్రత్యేకంగా తీవ్ర స్థాయిలో ఉన్న రోగుల్లో ఈ ప్రోటీన్ 200 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
కొత్త రక్తపరీక్ష ప్రయోజనాలు
- రక్తపరీక్ష ద్వారా సరళంగా, తక్కువ ఖర్చుతో అల్జీమర్స్‌ను గుర్తించొచ్చు.
- PET స్కాన్ లాంటి ఖరీదైన పరీక్షలకు భయపడాల్సిన అవసరం లేదు.
- వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి త్వరగా చికిత్స మొదలు పెట్టవచ్చు.
- కొత్త మందుల అభివృద్ధికి ఈ పరీక్ష కీలకం కానుంది.
వైద్య రంగంలో మైలురాయి
అల్జీమర్స్ వ్యాధి కోసం కొత్తగా అందుబాటులోకి వచ్చిన సరళమైన రక్త పరీక్ష అనేది వైద్య రంగానికి ఓ మైలురాయి లాంటిది. ఈ పరీక్ష ద్వారా డాక్టర్లు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించగలరు. భవిష్యత్తులో ఇది ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తే, లక్షలాది మందికి ఇది ఎంతో మేలు చేయొచ్చు.
ఇది కూడా చదవండి