A New Study | చిన్న నిద్ర తీస్తే చాలు.. మెమెరీ బూస్టప్‌!

A New Study: నిద్ర అంటే కేవలం అలసట పోగొట్టడానికే కాదు… మేధ‌స్సును బ‌లోపేతం చేసుకోవ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ట‌. తాజాగా ఓ అధ్య‌య‌నంలో ఈ విష‌యం తేలింది. కొద్ది సేపు కునుకు (Nap) తీసినా మన మెదడు పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశోధ‌కులు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ (Harvard Medical School)లోని పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం జ‌న‌ర‌ల్ ఆఫ్ న్యూరోసైన్స్ (Journal of Neuroscience) అనే పత్రికలో ప్రచురితమైంది. 25 మందిపై ఈ ప‌రిశోధ‌న జ‌రిగింది. వారికి టైపింగ్ సీక్వెన్స్ నేర్పించి, ఆ తర్వాత స్వ‌ల్ప నిద్ర తీయ‌మ‌ని చెప్పారు.

A New Study

A New Study : నిద్రలో మెమరీ ప్రాసెసింగ్

ఈ అధ్యయనంలో ముఖ్యంగా తెలుసుకున్న విషయం ఏమిటంటే.. నిద్ర సమయంలో మెదడు కార్టెక్స్ (Cortex – మెదడులోని బయటి పొర) ఎక్కువగా యాక్టివ్‌గా మారుతుంది. ముఖ్యంగా ముందు పని చేసిన సమయంలో యాక్టివ్‌గా ఉన్న మెదడు భాగాలు… నిద్రలో ఉన్నప్పుడు రిథమిక్ (rhythmic), పునరావృత (repetitive) తరహాలో పనిచేస్తాయని గుర్తించారు. మనం నేర్చుకున్న సమాచారాన్ని నిద్ర సమయంలో మెదడు ప్రాసెస్ చేస్తోందని ఇది సూచించింది. అంటే.. తాత్కాలికంగా మెదడులోకి వచ్చిన సమాచారం అనేది నిద్ర సమయంలో స్థిరమైన, దీర్ఘకాలిక జ్ఞాపకంగా మారుతుందన్న‌మాట‌.

పనితీరు మెరుగుపడిందిలా..

నిద్ర తర్వాత పాల్గొన్నవారి పనితీరులో గణనీయమైన మెరుగుదల కనిపించింది. ముఖ్యంగా మెదడులో ‘ప్లానింగ్ మూవ్‌మెంట్’ (Planning Movement)కు సంబంధించి ఉన్న ప్రాంతాల్లో బ్రెయిన్ యాక్టివిటీ పెరిగింది. నిద్రకు ముందు కేవలం ‘చర్యలు చేసే భాగాలు’ (Motor Execution Regions) యాక్టివ్‌గా ఉన్నా ఆ తర్వాత ‘ప్లానింగ్’ కి సంబంధించిన మెదడు భాగాల్లో కూడా యాక్టివిటీ మెరుగుప‌డింది. ఇది భవిష్యత్‌లో మెరుగైన పనితీరు సాధించడంలో సహాయపడే సూచనగా పరిశోధకులు పేర్కొన్నారు.

A New Study

నిద్రలో మెదడు తరంగాలు (Brain Rhythms)

హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన సైకాలాజీ ప్రొఫెసర్ డానా మనోచ్ (Dana Manoach) ఈ పరిశోధన గురించి ఆస‌క్తిగ‌ల విష‌యాలు చెప్పారు. “నిద్ర సమయంలో మెదడు మొత్తం రిథమిక్ తరంగాలతో నిండి ఉంటుంది. కానీ.. నేర్చుకున్న తర్వాత ఈ తరంగాలు మరింతగా ప్రబలతాయి. దీని వల్ల జ్ఞాపకాలు స్థిరపడి, ఆ త‌ర్వాత‌ బలపడతాయి.” అన్నారు. ఈ బ్రెయిన్ రిథమ్స్ అన్నింటికన్నా ముఖ్యమైనవి. ఇవి మెమరీ ఫంక్షన్ బలోపేతానికి అవసరం. మరింతగా చెప్పాలంటే ఈ తరంగాలు “మెడిటేషన్”లో గమనించే అఫెక్ట్‌లను పోలి ఉంటాయని కూడా చెప్పొచ్చు.

ప్రకృతి ప్రసాదించిన మెమరీ బూస్టర్

మనం ఒకే ఒక పని మీద ఎక్కువ సమయం కష్టపడితే మెదడు అలసిపోతుంది. అయితే.. చిన్న నిద్ర తీసుకుంటే మెదడు ఆ పని సంబంధించిన సమాచారాన్ని జీర్ణించుకుని, జ్ఞాపకాలుగా నిలుపుతుంద‌ని ఈ ప‌రిశోధ‌న ద్వారా తేలింది. ఈ ప్రక్రియను శాస్త్రంలో Memory Consolidation అంటారు. అంటే.. తాత్కాలిక మెమరీ అనేది స్థిరమైన జ్ఞాపకంగా మారుతుంద‌న్న‌మాట‌. అందువల్లే విద్యార్థులు పరీక్షల ముందు చిన్న నిద్ర తీసుకోవడం వల్ల చదువులో మెరుగైన ఫలితాలు వస్తాయని అంటున్నారు నిపుణులు. అలాగే ఉద్యోగులు, క్రియేటివ్ ప్రొఫెషనల్స్ కూడా మధ్యాహ్న స‌మ‌యంలో చిన్న నిద్ర తీసుకుంటే, ఆ తర్వాత వారి పనితీరు చాలా మెరుగవుతుందని అంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Covid-19 virus : క‌ణాల‌పై ఇమ్యూన్‌ ఎటాక్‌కు కార‌కం | A Study

కోవిడ్ (Covid-19 virus) మళ్లీ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ క్ర‌మంలో ఇజ్రాయేల్‌కు చెందిన శాస్త్రవేత్తలు కొత్తగా చేసిన ఒక కీల‌క అధ్యయనం వైద్య నిపుణుల్లో కలకలం రేపుతోంది. Covid-19 virusలో ఉన్న ఓ ప్రత్యేకమైన ప్రొటీన్ (న్యూక్లియోక్యాప్సిడ్ ప్రొటీన్- NP) మన శరీరంలోని ఆరోగ్యకర కణాల మీద‌ రోగ నిరోధక వ్యవస్థను దాడికి దించేలా చేస్తుంద‌ని తేలింది. ఈ అధ్యయనం ప్రముఖ మెడికల్ జర్నల్ “Cell Reports” లో ప్రచురితమైంది.

Covid-19 virus

Covid-19 virus : రోగ నిరోధక వ్యవస్థ తప్పుదారి

జెరూసలేం Hebrew Universityకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో భాగంగా ప‌లు విషయాలను గుర్తించారు. కోవిడ్ వైరస్‌లోని న్యూక్లియోక్యాప్సిడ్ ప్రొటీన్ (NP) సాధారణంగా వైరస్ జన్యుపరమైన సమాచారాన్ని ప్యాక్ చేసే పని చేస్తుంద‌ని తేల్చారు. కానీ, ఇది ఇన్‌ఫెక్ట్ అయి ఉన్న కణాల నుంచి బయటకి వచ్చి పక్కనే ఉన్న ఆరోగ్యకరమైన కణాలపైకి వెళ్తుంద‌ని,
ఆ కణాల ఉపరితలంపైకి వెళ్లిన తర్వాత మన రోగ నిరోధక వ్యవస్థ దీనిని ప్రమాదకరమైన ద్రవ్యంగా గుర్తించి దాని మీద దాడికి దిగుతుంద‌ని వెల్ల‌డైంది. ఈ దాడిలో anti-NP antibodies అనే రసాయనాలు ఆరోగ్యకరమైన కణాలను కూడా నాశనం చేస్తాయి.
ఈ ప్రక్రియ ద్వారా Complement Pathway అనే రోగ నిరోధక వ్యవస్థ భాగం యాక్టివేట్ అయి, శరీరంలో inflammation, కణ నష్టం జరుగుతుంది. ఈ పరిస్థితులే తీవ్రమైన కోవిడ్ లక్షణాలకు, “లాంగ్ కోవిడ్”కు కారణమవుతున్నాయని పరిశోధకులు అంటున్నారు.

Covid-19 virus

Covid-19 virus : ప్రయోగాలు ఎలా జరిగాయి?

ల్యాబ్‌లో తయారైన కణాలు,కోవిడ్ బాధితుల నుంచి సేకరించిన నమూనాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
వారు కనుగొన్న విషయం ఏమిటంటే.. NP అనే ప్రొటీన్ కణాల ఉపరితలంపై ఒక ప్రత్యేకమైన మాలిక్యూల్‌కు కట్టబడి, ఆరోగ్యకరమైన కణాల మీదే తప్పుడు సంకేతాన్ని పంపుతుంది.

ఎనాక్సాపారిన్ అనే ఔషధం ప్రభావం

శాస్త్రవేత్తలు ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా గుర్తించారు. Enoxaparin అనే రక్తాన్ని తగ్గించే ఔషధం (ఇది సాధారణంగా హీమొరాయిడ్, హార్ట్ బ్లాక్ వంటి వాటికి వాడతారు) ఈ NP ప్రొటీన్ ఆరోగ్య కణాల మీద అటాచ్ కావడాన్ని అడ్డుకుంటుంది.
ఇది ప్రయోగశాలలో నిర్వహించిన టెస్టులు, రోగుల నమూనాల్లో ధృవీకరించబడింది. అంటే, ఈ మందు NP ప్రొటీన్‌కు అడ్డుగోడలా పనిచేసి రోగ నిరోధక వ్యవస్థ తప్పుగా ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేయకుండా అడ్డుకుంటుంది.

Covid-19 virus

Covid-19 virus : ఈ పరిశోధన వల్ల కలిగే ప్రయోజనాలు

ఈ ప‌రిశోధ‌న కోవిడ్‌కు సంబంధించిన రోగ నిరోధక సమస్యల నివారణకు కొత్త మార్గాలను ఈ అధ్యయనం సూచిస్తోంది.
ముఖ్యంగా లాంగ్ కోవిడ్, తీవ్రమైన లక్షణాలున్న రోగులకు ఇలాంటి ఔషధాల ద్వారా చికిత్స చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

Covid-19 virus : క‌ల‌వ‌ర పెడుతున్న‌ కొత్త వేరియంట్

ఇంతలో మరో కొత్త కోవిడ్ వేరియంట్ NB.1.8.1 కూడా అనేక దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది ఒమిక్రాన్ వంశానికి చెందినదే. ఇది మొదటిగా 2025 జనవరిలో గుర్తించబడింది. ఇప్పటి వరకు ఇది భారత్, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, చైనా, మాల్దీవులు,ఈజిప్టు దేశాల్లో కలకలం సృష్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వేరియంట్‌ను “Variant Under Monitoring” గా గుర్తించింది. అంటే ఇది ప్రమాదకరమైన స్థాయికి ఇంకా రాకపోయినా దీని వేగంగా వ్యాప్తి అనుమానాలకు తావిస్తోంది.

Covid-19 virus : జాగ్ర‌త్త‌లు పాటించాల‌

ఈ తాజా పరిశోధనల ద్వారా మనకు రెండు స్పష్టమైన విషయాలు అర్థం అవుతున్నాయి. కోవిడ్‌కు సంబంధించి మన శరీర రోగ నిరోధక వ్యవస్థే అప్పుడప్పుడు తప్పుడు స్పందన చూపించి ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ తప్పుడు దాడుల్ని అడ్డుకునే ఔషధాలపై పరిశోధనలు జరగడం మంచి పరిణామం. కోవిడ్ ఇంకా పూర్తిగా వెళ్లిపోలేదు. కొత్త వేరియంట్లు వస్తున్నాయి. అందుకే జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఇలాంటి శాస్త్రీయ పరిశోధనలు మన భవిష్యత్‌కు ఆరోగ్య భద్రతను కలిగిస్తాయి.

Covid-19 virus

ఇది కూడా చ‌ద‌వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిదా?.. విస్తుబోయే ఓ అధ్యయనం | olive oil uses

olive oil uses : ఆలివ్ ఆయిల్‌ (olive oil) ను ఆరోగ్యకరమైన నూనెగా ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. ఇది హార్ట్ హెల్త్‌కు మంచిదని, శరీరంలో శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు. అయితే.. తాజాగా ఒక అధ్యయనం విస్తుబోయే వాస్త‌వాన్ని వెల్ల‌డించింది. ఆలివ్ ఆయిల్ (olive oil) మీద ఉన్న ఈ నమ్మకాన్నిప‌టాపంచలు చేసింది. ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఓలిక్ యాసిడ్ (Oleic Acid) అనే కొవ్వు ఆమ్లం, శరీరంలో కొవ్వు కణాలు పెరిగేలా చేస్తుందని, ఇది దీర్ఘకాలికంగా తీసుకుంటే స్థూలకాయం (Obesity)కు దారితీయొచ్చ‌ని వెల్ల‌డించింది.

Olive Oil-Aarogya Sravanthi

olive oil uses: గత అనుభవాలు, ఆరోగ్య ప్రయోజనాలు

నార్త్ అమెరికన్ ఆలివ్ ఆయిల్ అసోసియేషన్ ప్రకారం, 50%కి పైగా అమెరికన్ కుటుంబాలు తమ రోజువారీ వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను వాడుతున్నారు. మంచి ఫ్లేవర్‌కు తోడు ఆరోగ్య ప్రయోజనాలు క‌లిగిస్తుంద‌ని దీన్ని వినియోగిస్తుంటారు. నేష‌న‌ల్ లైబ్ర‌రీ ఆఫ్ మెడిసిన్ (National Library of Medicine) పత్రికలో ప్రచురితమైన ఒక పాత అధ్యయనం ప్రకారం ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (anti-inflammatory), హెపటోప్రొటెక్టివ్ (hepatoprotective), రెనోప్రొటెక్టివ్ (renoprotective), యాంటీ న్యూరోడిజెనరేటివ్ (anti-neurodegenerative) గుణాలు క‌లిగి ఉంటాయి. త‌ద్వారా ఆలివ్ ఆయిల్ మంచి ఆరోగ్య ప‌దార్థంగా గుర్తింపు పొందింది.

olive oil uses : తాజా పరిశోధన ఏమంటోంది?

Cell Reports అనే ప్రముఖ మెడికల్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన పరిశోధనలో విస్తుబోయే విష‌యాలు వెలుగు చూశాయి. ఆలివ్ ఆయిల్‌లో అధికంగా ఉండే ఓలిక్ యాసిడ్‌ను ఎక్కువ‌ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కణాలు విప‌రీతంగా ఉత్పత్తి అవుతాయని తేలింది. ఇది గుండె సంబంధిత వ్యాధులు, టైప్-2 డయాబెటిస్, ఇతర మెటబాలిక్ సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని వెల్ల‌డైంది.

ఓలిక్ యాసిడ్ ప్రభావం.. శాస్త్రీయంగా ఎలా పని చేస్తుంది?

ఓలిక్ యాసిడ్, మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్ (Monounsaturated Fat)కు చెందింది. ఇది మంచి కొవ్వు అని భావించబడుతుంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే మంచిది కాద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. ఇది AKT2 అనే ప్రొటీన్ల ఉత్పత్తిని పెంచుతుంది. అదే సమయంలో శరీరంలోని కొవ్వు కణాల నియంత్రణకు అవసరమైన LXR అనే ప్రొటీన్లను తగ్గిస్తుంది. ఫలితంగా కొత్త కొవ్వు కణాల ఉత్పత్తి అధికమవుతుంది.

Olive Oil-Aarogya Sravanthi

olive oil uses : పరిశోధన ఎలా జరిగింది?

ఈ అధ్యయనం యూనివర్సిటీ ఆఫ్ ఒక్లహోమా కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ మైఖేల్ రూడాల్ఫ్ నేతృత్వంలో జరిగింది. ఆయన బృందం Yale యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. మైళ్లను వివిధ రకాల కొవ్వు ఆమ్లాలతో తినిపించి, వాటి శరీరాలపై కలిగిన ప్రభావాలను విశ్లేషించారు. కొబ్బరినూనె, పీనట్ ఆయిల్, పాలు, పంది మాసం నూనె, సోయా నూనెలతో పోలిస్తే ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఓలిక్ యాసిడ్ ప్రభావం చాలా అధికంగా ఉందని తేలింది.

శాస్త్రవేత్త ఏమంటున్నారు?

డాక్ట‌ర్ రూడాల్ఫ్ తెలిపిన ప్రకారం శరీరంలో కొవ్వు కణాలను మిలిటరీ సైనికుల్లా ఊహించొచ్చు. ఓలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు ఈ ‘కొవ్వు సైన్యం’ గణనీయంగా పెరుగుతుంది. దీంతో శరీరం అధిక పోషకాలను నిల్వ చేయగల సామర్థ్యం పెరుగుతుంది. ఇది మొదట్లో మంచిదే కానీ, తరచూ ఇలా జరిగితే స్థూలకాయం వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్‌ను ఎలా వినియోగించాలి? (olive oil uses)

  • మితంగా తీసుకోవాలి : రోజుకు 1-2 టీస్పూన్లలో ఉండే పరిమితిలో మాత్రమే వాడాలి.
  • వివిధ నూనెలతో బదిలీ వినియోగం: ఆలివ్ ఆయిల్ మాత్రమే కాకుండా కొబ్బరినూనె, ఆవ నూనె వంటి ఇతర ఆరోగ్యకర నూనెలను కూడా వాడాలి.
  • బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఎక్కువగా ఉన్నవారు ఆలివ్ ఆయిల్ వాడకంపై మరింత జాగ్రత్తగా ఉండాలి.
  • డాక్ట‌ర్ స‌ల‌హా త‌ప్ప‌నిస‌రి : హార్ట్ డిసీజ్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడకూడదు.

Olive Oil-Aarogya Sravanthi

మితంగా వాడండి

ఈ అధ్యయనం మనకు ఒక స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తుంది. ఏదైనా మితంగా తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైనదే కానీ, అధిక మోతాదులో తీసుకుంటే అది హానికరమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. మితంగా వాడండి. డాక్టర్ సలహా తీసుకోండి. ఆరోగ్యంగా జీవించండి.

ఇది కూడా చ‌ద‌వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సోరియాసిస్… కొన్ని అపోహలు, మ‌రికొన్ని నిజాలు | Psoriasis

Psoriasis :  సోరియాసిస్ (Psoriasis) అనే చర్మ వ్యాధి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఒక చర్మ (skin) సంబంధిత రుగ్మ‌త‌. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ (immune system) సరిగా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. దీన్ని వ్యాధిగా కాకుండా ఒక జీవితాంతం ఉండే సమస్యగా భావించాలి. అయితే, దీనిపై చాలా అపోహలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం..

 Psoriasis

 

Psoriasis అంటుకునే వ్యాధా?

సోరియాసిస్ (Psoriasis) ఒక అంటుకునే వ్యాధి కాదు ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకొకరికి వ్యాపించదు. సోరియాసిస్ ఉన్నవాళ్లతో కలిసి తిరిగినా, వారితో భోజనం చేసినా, వారిని ముట్టుకున్నా ఏమీ కాదు. ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి (autoimmune disease) అని అంటున్నారు డాక్ట‌ర్లు. మన శరీర రోగనిరోధక వ్యవస్థ స‌రిగా ప‌నిచేయ‌న‌ప్పుడు ఎక్కువగా చర్మ కణాలను తయారు చేస్తుంది. ఈ సమస్యతో చర్మం మీద దద్దుర్లు, పొడిబారిన మచ్చలు, చిట్లిన గాయాలు గాయం వంటివి ఏర్పడతాయి.

అప‌రిశుభ్రత వల్ల వస్తుందా?

సోరియాసిస్‌ (Psoriasis)కు శుభ్ర‌త‌, అప‌రిశుభ్ర‌త‌తో సంబంధం లేదు. ఇది ఒక శారీరక‌ సమస్య. చర్మం మీద కణాల ఉత్పత్తి అతి వేగంగా జరుగడం వల్ల వస్తుంది. సాధారణంగా చర్మ కణాలు 28 రోజులకోసారి మారతాయి. సోరియాసిస్‌ ఉన్నవారిలో 4–5 రోజుల్లోనే కొత్త చర్మం వచ్చేస్తుంది. అది సరైన రీతిలో పెరగకపోవడంతో చర్మంపై పొడిబారిన మచ్చలు, చిట్లిన గాయాలు కనిపిస్తాయి.

Psoriasis ఎన్ని ర‌కాలు

సోరియాసిస్‌ (Psoriasis) లో చాలా రకాలుగా ఉంటాయి. ప్రతి రకానికీ వేర్వేరు లక్షణాలు క‌నిపిస్తాయి.
వాటిలో ముఖ్యంగా..

  • Plaque Psoriasis: ఇది సాధారణం. దద్దుర్లు వంటి మచ్చలు ఉంటాయి.
  • Guttate Psoriasis: చిన్ని చిన్ని మచ్చలు, వాన చినుకుల్లా కనిపిస్తాయి.
  •  Inverse Psoriasis: కేవలం మడతలలో కనిపిస్తుంది (armpits, groin).
  • Pustular Psoriasis: కాళ్లూ చేతులు pus‌తో కూడిన మచ్చలు ఉంటాయి.
  • Erythrodermic Psoriasis: శరీరం మొత్తం మీద తీవ్రమైన ఎర్రటి మచ్చలు.

Psoriasis

పూర్తిగా నయం చేయొచ్చా?

ప్రస్తుతం సోరియాసిస్‌ (Psoriasis)కు శాశ్వతంగా నయం అయ్యే మందు లేదు. ఇది జీవితాంతం ఉండే దీర్ఘకాలిక (chronic) సమస్య. కానీ ఆందోళన పడాల్సిన పనిలేదు. సరైన చికిత్సతో దీనిని నియంత్రించొచ్చు.
క్రీములు, అయింట్‌మెంట్లు, UV therapy, టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇలా అనేక మార్గాల్లో చికిత్సలు (treatments ) అందుబాటులో ఉన్నాయి.

Psoriasis ఇతరులకు ఇది బాధ కలిగిస్తుందా?

సోరియాసిస్ ఉన్నవారు సామాజికంగా వివ‌క్ష‌కు గుర‌వుతారు. కానీ, ఆ వ్యాధి (Psoriasis)  ఉన్న వారిప‌ట్ల అలా ప్ర‌వ‌ర్తించ‌చొద్దు. ఇది అంటుకునే వ్యాధి కాదు. అయినా కొంత మంది అపోహల వల్ల వారి నుంచి దూరంగా ఉంటారు. ఇది బాధాకర విషయం. అందుకే ప్రజల్లో అవగాహన అవసరం. మనం వారిని అర్థం చేసుకోవాలి, ఆదరించాలి.

చర్మానికి మాత్రమే పరిమితమా?

సోరియాసిస్ చర్మ వ్యాధి మాత్రమే కాదు. ప్రస్తుతం పరిశోధనల ప్రకారం 6–42 శాతం మందికి ఈ సమస్యతో పాటు psoriatic arthritis కూడా ఉంటుంది. అంటే.. ముఖ్యంగా మోకాళ్లు, చేతులు, పాదాలు వంటి కీళ్లనూ ప్రభావితం చేస్తుంది. అలాగే, మానసిక ప్రభావం (affects) కూడా ఉంటుంది. ఉత్కంఠ, డిప్రెషన్, ఆత్మవిశ్వాస లోపం వంటి సమస్యలు కనిపిస్తాయి.

సోరియాస్‌కు మందులు లేవా?

సోరియాస్‌కు అనేఏక చికిత్సలు ఉన్నాయి. చర్మంపై వేసే క్రీములు, జెల్స్, ఫోమ్స్ మొదలుకొని UV therapy, డాక్టర్లు సూచించే టాబ్లెట్స్, ఇంజెక్షన్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. చర్మానికి తగిన ప్రదేశంలో ప్రారంభమైన‌ వెంటనే వైద్యుని సలహాతో సరైన చికిత్స‌ను ఎంచుకోవచ్చు.

Psoriasis .. పెద్దవారికే వస్తుందా?

సోరియాసిస్ పెద్ద‌ల (adults)కే కాదు.. చిన్నపిల్లలకూ రావచ్చు. ఇది ఎక్కువగా 20–30 సంవత్సరాల మధ్య మొదలవుతుంది. 50–60 సంవత్సరాల మధ్య మొదలయ్యే అవకాశం కూడా ఉంది.
చాలా అరుదుగా పిల్లలకు కూడా ఇది రావచ్చు.

Psoriasis

ఇది ఎక్జిమా లాంటిదేనా?

ఎగ్జిమా (eczema) చాలాసార్లు అలర్జీ వల్ల వస్తుంది. కానీ సోరియాసిస్‌ ఓ ఆటోఇమ్యూన్ సమస్య.
ఎక్జిమా చిన్నపిల్లలకే ఎక్కువగా వస్తుంది. తరచూ మాయం అవుతుంది. కానీ సోరియాసిస్‌ జీవితాంతం ఉండొచ్చు.

డైట్ మార్చితే నయం అవుతుందా?

ఏ స్పెసిఫిక్ డైట్ వల్ల (Changing your diet) కూడా ఈ వ్యాధి పూర్తిగా న‌యం కాదు. అయితే. ఆరోగ్యకరమైన ఆహారం, తక్కువ బరువు, వ్యాయామం లాంటివి జీవన ప్రామాణాలు మెరుగుపరుస్తూ ఈ వ్యాధి తీవ్ర‌త‌ను త‌గ్గించొచ్చు. మద్యపానం, పొగతాగడం వంటివి సోరియాసిస్‌ను పెంచొచ్చు. కాబ‌ట‌ట్టి వీటికి దూరంగా ఉండాలి.

 

ఇది కూడా చ‌ద‌వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Stem cell therapy| హృద్రోగుల‌కు ఆశా కిర‌ణం.. హార్ట్ ప్యాచ్ : Good News

Stem cell therapy : వైద్యరంగంలో ఒక అద్భుతమైన ముందడుగు. మనిషి గుండె మార్పిడి కోసం వేచి ఉండే బాధితులకు ఊర‌ట క‌లిగించే ప‌ద్ధ‌తి అందుబాటులోకి వ‌చ్చింది. ఓ చిన్న విధానం ద్వారా ఇక నుంచి హృద్రోగుల ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు.

(Stem cell Therapy

శుభ‌వార్త చెప్పిన జ‌ర్మ‌నీ శాస్త్ర‌వేత్త‌లు

అమెరికాలో ప్రతి క్షణం వేల మంది పెద్దలు, వందల మంది చిన్నపిల్లలు ప్రాణాపాయ స్థితిలో గుండె మార్పిడి (Heart transplant) కోసం వేచి చూస్తున్నారు. వీరి నిరీక్ష‌ణకు ఆరు నెలలకంటే ఎక్కువ స‌మ‌యం ప‌డుతోంది. అయితే.. ఈలోపు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు . పిల్లల విషయంలోనైతే ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మరణిస్తున్నారు. ఈ క్ర‌మంలో జర్మనీ శాస్త్రవేత్తలు ఓ శుభ‌వార్త చెప్పారు. స్టెమ్ సెల్ టెక్నాలజీ (Stem cell Therapy) ద్వారా హార్ట్‌ప్యాచ్ (Heart Patch) అనే విధానంతో రోగిని బ‌తికించుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు. గుండె మార్పిడి జ‌రిగే లోపు ఈ హార్ట్‌ప్యాచ్ ద్వారా ఉప‌శ‌మ‌నం క‌లిగించొచ్చ‌ని అంటున్నారు. అంతేకాదు… ఇది కొన్ని కేసుల్లో శాశ్వతంగా కూడా ప‌నిచేస్తోంద‌ని తెలిపారు.

Stem cell therapy : హార్ట్ ప్యాచ్  .. ఓ చిన్న ఆశ

ఈ హార్ట్ ప్యాచ్ (Heart Patch) అంటే గుండెపై కుట్టగలిగే మినీ గుండె కణజాలం. స్టెమ్ సెల్స్ (Stem cell) నుంచి దీన్ని తయారు చేస్తారు. కోలాజెన్ హైడ్రోజెల్ అనే జెల్‌లో స్థిరీకరించి రూపొందిస్తారు. ఒక ప్యాచ్‌లో సుమారు 200 మిలియన్ కార్డియోమయోసైట్ కణాలు ఉంటాయి. ఈ ప్యాచ్‌ను శస్త్రచికిత్స ద్వారా గుండెపై అమర్చవచ్చు. అది కూడా పెద్దగా కోతలు లేకుండానే (మినిమల్లి ఇన్వేసివ్ సర్జరీ) ఈ ప్ర‌క్రియ (Stem cell Therapy) పూర్త‌వుతుంది.

Stem cell therapy : ప్ర‌యోగం స‌క్సెస్‌

ఈ విధానం మొదట రీసస్ మాకాక్ అనే మంకీలపై పరీక్షించారు. 2021లో తొలిసారిగా ఒక 46 సంవత్సరాల మహిళపై ఈ ప్యాచ్ (Stem cell Therapy)  అమర్చారు. ఆమెకు కొత్త గుండె దొరికే వరకు ఇది ప్రాణాలను నిలబెట్టింది. ఈ సాంకేతికతను ఇప్పటికే 15 మంది తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ బాధితులపై ప్రయోగించి విజ‌యం సాధించారు. ఇది హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ (Heart transplant)కు ఒక బ్రిడ్జ్‌లా పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు.

(Stem cell Therapy

హార్ట్ ఫెల్యూర్‌తో పెరుగుతున్న మ‌ర‌ణాలు

ప్రపంచంలో సుమారు 50 వేల మంది తుది దశ గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. దాత‌ల సంఖ్య త‌క్కువగా ఉండ‌టంతో సంవత్సరానికి స‌గ‌టున 5 వేల ట్రాన్స్‌ప్లాంట్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో 6 మిలియన్లకు పైగా ప్రజలు హార్ట్ ఫెయిల్యూర్ (Stem cell Therapy) తో చ‌నిపోతున్నారు. ఈ సంఖ్య మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ “హార్ట్ ప్యాచ్”  (Heart Patch) వంటి పరిష్కారాలు ఎంతో అవసరం.

Stem cell therapy : ఖర్చు ఎంత?

లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో కార్డియాక్ ఫార్మకలజీలో ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ సియాన్ హార్డింగ్ మాట్లాడుతూ “నేను ఈ ప్యాచ్‌లను స్వయంగా తయారు చేశాను. ఈ టెక్నాలజీ స్కేల్ చేయడం పూర్తిగా సాధ్యం. ఒక మంచి గుణనిల్వ ఉన్న హార్ట్ టిష్యూ ప్యాచ్   (Stem cell Theraphy)  తయారు చేయడానికి సుమారుగా 15 వేల డాల‌ర్లు ఖర్చు అవుతుంది. ఇది పెద్దగా ఖరీదైనది కాదు” అన్నారు. ఇదంతా ఒక గుండె మార్పిడి ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువే. అంటే, ఇది పేదలకు కూడా అందుబాటులోకి రావచ్చు అన్న మాట.

ట్రాన్స్‌ప్లాంట్‌ అవసరం ఉండ‌దా?

ఇప్పటి వరకు ఈ ప్యాచ్‌ల (Heart Patch) ను బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంట్ (Bridge to transplant)గా ఉపయోగించారు. అంటే… గుండె మార్పిడి జ‌రిగే వరకు కాలం గడిపే పరిష్కారమ‌న్న మాట‌. కానీ భవిష్యత్‌లో ఇది శాశ్వత పరిష్కారంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ పూర్త‌యితే ఈ ప్యాచ్‌లు గుండె మార్పిడి అవసరాన్ని పూర్తిగా తొలగించగలవా? అనే ప్రశ్నకు సమాధానం దొరకొచ్చు. ఇది గుండె వైఫల్యం ఉన్నవారికే కాదు.. గుండె టిష్యూకు నష్టం వచ్చినవారికీ Stem cell Therapy ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు నిపుణులు.

ఇది కూడా చ‌ద‌వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 Symptoms of illness | ఈ సంకేతాలు కనిపిస్తే మీరు అనారోగ్యంతో ఉన్న‌ట్టే..

5 Symptoms of illness: మన ఆరోగ్యం (Health) మన జీవనశైల, ఆహారపు అలవాట్లు, దైనందిన చర్యలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని (Healthy Lifestyle Habits) అవలంబించకపోతే శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వాటి సంకేతాలూ (Signs of illness) మ‌న‌కు అందుతాయి. అయితే.. వాటిని మ‌నం అంత‌గా ప‌ట్టించుకోం. చాలామంది అస్వస్థత సంకేతాల (Warning Signs)ను గమనించక వాటిని చిన్న సమస్యలుగా తీసుకుంటారు. కానీ, ఇవి భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

 5 Symptoms of illness

5 Symptoms of illness: ముందుగా గుర్తించండి

మీ ఆరోగ్యం క్షీణిస్తోందని సూచించే కొన్ని ముఖ్యమైన సంకేతాలను చూద్దాం:

1. తరచూ జీర్ణకోశ సమస్యలు (Frequent Digestive Issues)
  • తరచుగా గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం లేదా డయేరియా సమస్యలు ఎదురవుతుంటే మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.
  • త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
2. శరీరానికి తగినంత శక్తి లేకపోవడం (Chronic Fatigue)
  • నిద్రపోయినా మళ్లీ మ‌త్తుగా, అలసటగా అనిపిస్తే ఇది పోషకాహార లోపానికి సంకేతం కావచ్చు.
  • శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్, హైడ్రేషన్ తగ్గిపోతే అలసట పెరుగుతుంది.
3. చర్మ సమస్యలు (Skin Problems)
  • ముఖంపై మొటిమలు, పొడిబారిన చర్మం, లేదా అలర్జీలు ఉంటే ఇవి శరీరంలో ఉన్న టాక్సిన్స్‌కు సూచనగా ఉండొచ్చు.
  • అధిక ప్రాసెస్డ్ ఫుడ్, తక్కువ నీరు తాగడం కూడా దీనికి కారణమవుతాయి.
4. తరచూ జలుబు & ఇన్ఫెక్షన్లు (Frequent Colds & Infections)
  • రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే మీరు తరచూ జలుబు, దగ్గు, లేదా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడిన‌ట్టు సంకేతం.
  • విటమిన్ C, ప్రొబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
5. మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు (Stress & Sleep Issues)
  • ఎక్కువగా టెన్షన్, డిప్రెషన్, ఫోకస్ చేయలేకపోవడం అనేది మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతం.
  • మెడిటేషన్, యోగా, సరైన జీవనశైలిని అవలంబించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
 5 Symptoms of illness

 

5 Symptoms of illness : ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు
  • పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోండి
  • రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి
  • ఒత్తిడిని తగ్గించే ధ్యానం, యోగా వంటి మార్గాలను అనుసరించండి
  • కృత్రిమ పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని తగ్గించండి
  • శారీరక శ్రమను పెంచేందుకు రోజూ వ్యాయామం చేయండి
5 Symptoms of illness: చిన్న‌ స‌మ‌స్య‌లే క‌దాని అనుకోవ‌ద్దు

ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్న చిన్న లక్షణాలను కూడా సీరియస్‌గా తీసుకోవడం అవసరం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మీ జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి.

ఇది కూడా చ‌ద‌వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *