సోరియాసిస్… కొన్ని అపోహలు, మ‌రికొన్ని నిజాలు | Psoriasis

Psoriasis :  సోరియాసిస్ (Psoriasis) అనే చర్మ వ్యాధి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ఒక చర్మ (skin) సంబంధిత రుగ్మ‌త‌. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ (immune system) సరిగా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. దీన్ని వ్యాధిగా కాకుండా ఒక జీవితాంతం ఉండే సమస్యగా భావించాలి. అయితే, దీనిపై చాలా అపోహలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం..

 Psoriasis

 

Psoriasis అంటుకునే వ్యాధా?

సోరియాసిస్ (Psoriasis) ఒక అంటుకునే వ్యాధి కాదు ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకొకరికి వ్యాపించదు. సోరియాసిస్ ఉన్నవాళ్లతో కలిసి తిరిగినా, వారితో భోజనం చేసినా, వారిని ముట్టుకున్నా ఏమీ కాదు. ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి (autoimmune disease) అని అంటున్నారు డాక్ట‌ర్లు. మన శరీర రోగనిరోధక వ్యవస్థ స‌రిగా ప‌నిచేయ‌న‌ప్పుడు ఎక్కువగా చర్మ కణాలను తయారు చేస్తుంది. ఈ సమస్యతో చర్మం మీద దద్దుర్లు, పొడిబారిన మచ్చలు, చిట్లిన గాయాలు గాయం వంటివి ఏర్పడతాయి.

అప‌రిశుభ్రత వల్ల వస్తుందా?

సోరియాసిస్‌ (Psoriasis)కు శుభ్ర‌త‌, అప‌రిశుభ్ర‌త‌తో సంబంధం లేదు. ఇది ఒక శారీరక‌ సమస్య. చర్మం మీద కణాల ఉత్పత్తి అతి వేగంగా జరుగడం వల్ల వస్తుంది. సాధారణంగా చర్మ కణాలు 28 రోజులకోసారి మారతాయి. సోరియాసిస్‌ ఉన్నవారిలో 4–5 రోజుల్లోనే కొత్త చర్మం వచ్చేస్తుంది. అది సరైన రీతిలో పెరగకపోవడంతో చర్మంపై పొడిబారిన మచ్చలు, చిట్లిన గాయాలు కనిపిస్తాయి.

Psoriasis ఎన్ని ర‌కాలు

సోరియాసిస్‌ (Psoriasis) లో చాలా రకాలుగా ఉంటాయి. ప్రతి రకానికీ వేర్వేరు లక్షణాలు క‌నిపిస్తాయి.
వాటిలో ముఖ్యంగా..

  • Plaque Psoriasis: ఇది సాధారణం. దద్దుర్లు వంటి మచ్చలు ఉంటాయి.
  • Guttate Psoriasis: చిన్ని చిన్ని మచ్చలు, వాన చినుకుల్లా కనిపిస్తాయి.
  •  Inverse Psoriasis: కేవలం మడతలలో కనిపిస్తుంది (armpits, groin).
  • Pustular Psoriasis: కాళ్లూ చేతులు pus‌తో కూడిన మచ్చలు ఉంటాయి.
  • Erythrodermic Psoriasis: శరీరం మొత్తం మీద తీవ్రమైన ఎర్రటి మచ్చలు.

Psoriasis

పూర్తిగా నయం చేయొచ్చా?

ప్రస్తుతం సోరియాసిస్‌ (Psoriasis)కు శాశ్వతంగా నయం అయ్యే మందు లేదు. ఇది జీవితాంతం ఉండే దీర్ఘకాలిక (chronic) సమస్య. కానీ ఆందోళన పడాల్సిన పనిలేదు. సరైన చికిత్సతో దీనిని నియంత్రించొచ్చు.
క్రీములు, అయింట్‌మెంట్లు, UV therapy, టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఇలా అనేక మార్గాల్లో చికిత్సలు (treatments ) అందుబాటులో ఉన్నాయి.

Psoriasis ఇతరులకు ఇది బాధ కలిగిస్తుందా?

సోరియాసిస్ ఉన్నవారు సామాజికంగా వివ‌క్ష‌కు గుర‌వుతారు. కానీ, ఆ వ్యాధి (Psoriasis)  ఉన్న వారిప‌ట్ల అలా ప్ర‌వ‌ర్తించ‌చొద్దు. ఇది అంటుకునే వ్యాధి కాదు. అయినా కొంత మంది అపోహల వల్ల వారి నుంచి దూరంగా ఉంటారు. ఇది బాధాకర విషయం. అందుకే ప్రజల్లో అవగాహన అవసరం. మనం వారిని అర్థం చేసుకోవాలి, ఆదరించాలి.

READ more  Healthy Eating | ఆహారంతో దీర్ఘాయుష్షు

చర్మానికి మాత్రమే పరిమితమా?

సోరియాసిస్ చర్మ వ్యాధి మాత్రమే కాదు. ప్రస్తుతం పరిశోధనల ప్రకారం 6–42 శాతం మందికి ఈ సమస్యతో పాటు psoriatic arthritis కూడా ఉంటుంది. అంటే.. ముఖ్యంగా మోకాళ్లు, చేతులు, పాదాలు వంటి కీళ్లనూ ప్రభావితం చేస్తుంది. అలాగే, మానసిక ప్రభావం (affects) కూడా ఉంటుంది. ఉత్కంఠ, డిప్రెషన్, ఆత్మవిశ్వాస లోపం వంటి సమస్యలు కనిపిస్తాయి.

సోరియాస్‌కు మందులు లేవా?

సోరియాస్‌కు అనేఏక చికిత్సలు ఉన్నాయి. చర్మంపై వేసే క్రీములు, జెల్స్, ఫోమ్స్ మొదలుకొని UV therapy, డాక్టర్లు సూచించే టాబ్లెట్స్, ఇంజెక్షన్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. చర్మానికి తగిన ప్రదేశంలో ప్రారంభమైన‌ వెంటనే వైద్యుని సలహాతో సరైన చికిత్స‌ను ఎంచుకోవచ్చు.

Psoriasis .. పెద్దవారికే వస్తుందా?

సోరియాసిస్ పెద్ద‌ల (adults)కే కాదు.. చిన్నపిల్లలకూ రావచ్చు. ఇది ఎక్కువగా 20–30 సంవత్సరాల మధ్య మొదలవుతుంది. 50–60 సంవత్సరాల మధ్య మొదలయ్యే అవకాశం కూడా ఉంది.
చాలా అరుదుగా పిల్లలకు కూడా ఇది రావచ్చు.

Psoriasis

ఇది ఎక్జిమా లాంటిదేనా?

ఎగ్జిమా (eczema) చాలాసార్లు అలర్జీ వల్ల వస్తుంది. కానీ సోరియాసిస్‌ ఓ ఆటోఇమ్యూన్ సమస్య.
ఎక్జిమా చిన్నపిల్లలకే ఎక్కువగా వస్తుంది. తరచూ మాయం అవుతుంది. కానీ సోరియాసిస్‌ జీవితాంతం ఉండొచ్చు.

డైట్ మార్చితే నయం అవుతుందా?

ఏ స్పెసిఫిక్ డైట్ వల్ల (Changing your diet) కూడా ఈ వ్యాధి పూర్తిగా న‌యం కాదు. అయితే. ఆరోగ్యకరమైన ఆహారం, తక్కువ బరువు, వ్యాయామం లాంటివి జీవన ప్రామాణాలు మెరుగుపరుస్తూ ఈ వ్యాధి తీవ్ర‌త‌ను త‌గ్గించొచ్చు. మద్యపానం, పొగతాగడం వంటివి సోరియాసిస్‌ను పెంచొచ్చు. కాబ‌ట‌ట్టి వీటికి దూరంగా ఉండాలి.

 

ఇది కూడా చ‌ద‌వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *