Blood Pressure in Pregnant lady : గర్భిణులకు రక్తపోటు (బీపీ) నియంత్రణ చాలా ముఖ్యం. ఇది పెరిగితే తల్లీబిడ్డలకు ప్రమాదం. గర్భంతో ఉన్న మహిళతో ఆమె కడుపులో ఉన్న శిశువు కూడా అనారోగ్య బారిన పడొచ్చు. తద్వారా ప్రసవం సమయంలో తల్లీబిడ్డల ప్రాణానికి హాని కలగొచ్చు.
నార్మల్ రక్తపోటు స్థాయిలు
సిస్టోలిక్: 120 మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యురీ (mmHg) లోపు ఉండాలి.
డయాస్టోలిక్: 80 mmHg లోపు ఉండాలి.
గర్భిణుల Blood pressure రకాలు
గర్భంతో ఉన్నప్పుడు బీపీ (Gestational Hypertension)
ఇది గర్భంతో ఉన్న సమయంలో ప్రారంభమవుతుంది. సాధారణంగా ప్రసవం తర్వాత నయమవుతుంది.
ప్రీ ఎక్లాంప్షియా (Preeclampsia)
ఇది రక్తపోటు (Blood pressure:)తో పాటు మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల వస్తుంది. తల్లితోపాటు గర్భస్థ శిశువు ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది.
ఎక్లాంప్సియా (Eclampsia)
ఇది ప్రీ ఎక్లాంప్సియాకు తీవ్రమైన రూపం. దీంతో గర్భిణులు అపస్మారక స్థితికి చేరుకుంటారు. లేదా గుండెపోటుకు గురవుతారు. ప్రసవ సమయంలో మరణం కూడా సంభవించొచ్చు.
Blood Pressure in Pregnant lady తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. నియమిత వైద్య పర్యవేక్షణ:
- ప్రతి నెలా రక్తపోటు, మూత్రపరీక్షలు చేయించుకోవాలి.
- రిపోర్టలపై డాక్టర్‌తో చర్చించి సలహాలు, సూచనలు పాటించాలి
2. ఆహారపు అలవాట్లు:
- ఉప్పు తగ్గించాలి. రక్తపోటు నియంత్రణకు ఇది అత్యవసరం.
- పోషకాహారం తినాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి.
- కాఫీ , టీ లాంటి కాఫీన్ల వినియోగాన్ని తగ్గించాలి.
3. శారీరక వ్యాయామం:
- తేలికపాటి వ్యాయామం చేయడం ద్వారా రక్తపోటు నియంత్రణ సాధ్యమవుతుంది.
- నడక, Prenatal యోగా లాంటి సాధనలు పాటించాలి.
రక్తపోటుతో ఉన్నప్పుడు ప్రసవం
- గర్భస్థ శిశువు అనుకూలంగా ఎదుగుతున్నట్లయితే నార్మల్ డెలివరీ అవుతుంది.
- అనుకూల పరిస్థితులు లేనప్పుడు సిజేరియన్ ప్రసవం (Cesarean Delivery) చేస్తారు. – ఇది తల్లి ప్రాణాలను రక్షించడానికి అత్యవసరం.
ప్రసవం తర్వాత
- రక్తపోటు సాధారణ స్థాయికి చేరే వరకు ఔషధాలను తీసుకోవాలి.
- క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేసుకోవాలి.