Cancer Vaccine | క్యాన్స‌ర్ వ్యాక్సిన్ వ‌చ్చేస్తోందోచ్‌..

Cancer Vaccine

Cancer Vaccine : ఇక క్యాన్స‌ర్ భ‌యం వ‌ద్దంటోంది ర‌ష్యా. దీని విరుగుడును క‌నుగొంది. ఈ మ‌హ‌మ్మారిని జ‌యించేందుకు వ్యాక్సిన్‌ను త‌యారు చేసింది. త్వ‌ర‌లోనే దీన్ని ( vaccine) లాంచ్ చేయ‌బోతోంది. 2025 ఆరంభంలోనే ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. ఆ మేర‌కు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సంకేతాలు ఇచ్చారు. క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తాము అభివృద్ధి చేస్తోంద‌ని, ఇది తుది ద‌శకు చేరుకుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

 

Cancer Vaccine మార్కెట్‌లోకి ఎప్పుడంటే..

ప్రపంచాన్ని ప‌ట్టి పీడుస్తున్న ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్స‌ర్ ఒక‌టి. అనేక మంది దీని బారిఇన ప‌డుతున్నారు. ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ మ‌హ‌మ్మారిని నియంత్రించ‌డం త‌ప్ప నిర్మూల‌న అసాధ్య‌మ‌ని ఇప్ప‌టికే అనేక అధ్య‌య‌నాల్లో తేలింది. దీని నుంచి బ‌య‌ట ప‌డానికి చికిత్స లేద‌నే ప‌లుమార్లు వెల్ల‌డైంది. దీని బారిన ప‌డ‌కుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌కు ఎలాంటి ఔష‌ధాలూ లేవ‌ని ప‌రిశోధ‌న‌లు తెలిపాయి. అయితే.. దీన్ని ర‌ష్యా (Russia)

చాలెంజ్‌గా తీసుకుంది. mRNA క్యాన్సర్ వ్యాక్సిన్‌ను త‌యారు చేయ‌డంలో పురోగ‌తి సాధించింది. దీన్ని ఆ వ్యాధిగ్ర‌స్థుల‌కు త్వ‌ర‌లోనే అందుబాటులోకి తెస్తోంది. ముందుగా తమ పౌరులకు ఈ వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు తెలిపింది. క్ర‌మేణా అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి తెచ్చేందుకు కూడా స‌న్నాహాలు చేస్తోంది.

ఫ్రీగానే ఇస్తార‌ట‌!

రష్యా తమ సొంత mRNA క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ర‌ష్యా త‌మ దేశ పౌరుల‌కు ఉచితంగా అందజేయ‌నుంది. ఈ మేర‌కు ఆ దేశ‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రే కాప్రిన్ తెలిపారు. ర‌ష్యాకు చెందిన వార్తా సంస్థ TASS దీన్ని ప్ర‌చురించింది. ఈ క్యాన్సర్ ( (Cancer)వ్యాక్సిన్ 2025 ప్రారంభంలో ప్రజలకు అందుబాటులోకి వ‌స్తుంద‌ని పేర్కొంది. క్యాన్సర్ పెరుగుదల, వ్యాప్తిని ఈ వ్యాక్సిన్ నిరోధిస్తుంద‌ని ఆండ్రే కాప్రిన్ తెలిపారు. గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ కూడా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ క్యాన్స‌ర్‌ను ఈ వ్యాక్సిన్ ఎంత స‌మ‌ర్థంగా ఎదుర్కొంటుందో వివ‌రించారు.

నూత‌న సంవ‌త్స‌రంలో కొత్త ఆశ‌లు

ఈ ఏడాది ప్రారంభంలో క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రగతిపై పుతిన్‌ సంకేతాలు ఇచ్చారు. ఇదే విష‌యాన్ని గింట్స్‌బర్గ్ కూడా ప్ర‌స్తావించారు. కృత్రిమ మేధస్సు (AI) సాయంతో క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీని వేగ‌వంతం చేసి మార్కట్‌లోకి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు కూడా తెలిపారు. ఈ వ్యాక్సిన్ 2025 ఆరంభంలోనే అందుబాటులోకి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు.

గోప్యంగా మ‌రిన్ని వివ‌రాలు

క్యాన్స‌ర్ వ్యాక్సిన్ విష‌యంలో పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డికాలేదు. దాని పేరు ఏం ఉండ‌బోతోంది. ఇది ఎన్ని ర‌కాల క్యాన్స‌ర్ల‌కు ప‌నిచేస్తుంది అనే అంశాలను కూడా గోప్యంగా ఉంచారు. ఇలా అనేక వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉన్నా ఈ వ్యాక్సిన్ రావ‌డ‌మే గొప్ప విష‌య‌మ‌ని, ఆంకాలజీ రంగంలో పెద్ద విప్ల‌వ‌మ‌ని అంటున్నారు నిపుణులు.

READ more  Daily Calories intake | డిన్న‌ర్‌.. డేంజ‌ర్‌!

ప్ర‌య‌త్నాల్లో ఇత‌ర దేశాలు

క్యాన్సర్ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఇతర దేశాలు కూడా నిమగ్నమై ఉన్నాయి. క్యాన్సర్ చికిత్సలు అభివృద్ధి చేయడానికి క్యాన్సర్ చికిత్సలు అభివృద్ధి చేయడానికి యూకే ప్రభుత్వం, బయోఎన్‌టెక్ సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నాయి. మోడెర్నా, మెర్క్ అండ్ కో వంటి కంపెనీలు కూడా క్యాన్సర్ వ్యాక్సిన్లపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఇదే క్ర‌మంలో WHO ఇటీవ‌ల ఒక ప్ర‌క‌ట‌న చేసింది. హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV) కారణమైన సర్వికల్ క్యాన్సర్, హెపటైటిస్ B కారణమైన కాలేయ క్యాన్సర్ వ్యాక్సిన్లు ఇప్ప‌టికే అందుబాటులో ఉన్నాయ‌నిపేర్కొంది.

ల‌క్ష‌లాది మందికి ఉప‌శ‌మ‌నం

క్యాన్స‌ర్ వ్యాక్సిన్‌ను ర‌ష్యా అభివృద్ధి చేయడంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇది క్యాన్సర్ (Cancer) చికిత్సలో మైలురాయిగా నిలుస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇది విజయవంతమైతే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి ఉశ‌మ‌నం క‌లుగుతుంద‌ని నిపుణులు అంటున్నారు.

CancerVaccine

ఇది కూడా చ‌ద‌వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *