కోవిడ్ (Covid-19 virus) మళ్లీ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఇజ్రాయేల్‌కు చెందిన శాస్త్రవేత్తలు కొత్తగా చేసిన ఒక కీలక అధ్యయనం వైద్య నిపుణుల్లో కలకలం రేపుతోంది. Covid-19 virusలో ఉన్న ఓ ప్రత్యేకమైన ప్రొటీన్ (న్యూక్లియోక్యాప్సిడ్ ప్రొటీన్- NP) మన శరీరంలోని ఆరోగ్యకర కణాల మీద రోగ నిరోధక వ్యవస్థను దాడికి దించేలా చేస్తుందని తేలింది. ఈ అధ్యయనం ప్రముఖ మెడికల్ జర్నల్ “Cell Reports” లో ప్రచురితమైంది.
Covid-19 virus : రోగ నిరోధక వ్యవస్థ తప్పుదారి
జెరూసలేం Hebrew Universityకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో భాగంగా పలు విషయాలను గుర్తించారు. కోవిడ్ వైరస్‌లోని న్యూక్లియోక్యాప్సిడ్ ప్రొటీన్ (NP) సాధారణంగా వైరస్ జన్యుపరమైన సమాచారాన్ని ప్యాక్ చేసే పని చేస్తుందని తేల్చారు. కానీ, ఇది ఇన్‌ఫెక్ట్ అయి ఉన్న కణాల నుంచి బయటకి వచ్చి పక్కనే ఉన్న ఆరోగ్యకరమైన కణాలపైకి వెళ్తుందని,
ఆ కణాల ఉపరితలంపైకి వెళ్లిన తర్వాత మన రోగ నిరోధక వ్యవస్థ దీనిని ప్రమాదకరమైన ద్రవ్యంగా గుర్తించి దాని మీద దాడికి దిగుతుందని వెల్లడైంది. ఈ దాడిలో anti-NP antibodies అనే రసాయనాలు ఆరోగ్యకరమైన కణాలను కూడా నాశనం చేస్తాయి.
ఈ ప్రక్రియ ద్వారా Complement Pathway అనే రోగ నిరోధక వ్యవస్థ భాగం యాక్టివేట్ అయి, శరీరంలో inflammation, కణ నష్టం జరుగుతుంది. ఈ పరిస్థితులే తీవ్రమైన కోవిడ్ లక్షణాలకు, “లాంగ్ కోవిడ్”కు కారణమవుతున్నాయని పరిశోధకులు అంటున్నారు.
Covid-19 virus : ప్రయోగాలు ఎలా జరిగాయి?
ల్యాబ్‌లో తయారైన కణాలు,కోవిడ్ బాధితుల నుంచి సేకరించిన నమూనాలను శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
వారు కనుగొన్న విషయం ఏమిటంటే.. NP అనే ప్రొటీన్ కణాల ఉపరితలంపై ఒక ప్రత్యేకమైన మాలిక్యూల్‌కు కట్టబడి, ఆరోగ్యకరమైన కణాల మీదే తప్పుడు సంకేతాన్ని పంపుతుంది.
ఎనాక్సాపారిన్ అనే ఔషధం ప్రభావం
శాస్త్రవేత్తలు ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా గుర్తించారు. Enoxaparin అనే రక్తాన్ని తగ్గించే ఔషధం (ఇది సాధారణంగా హీమొరాయిడ్, హార్ట్ బ్లాక్ వంటి వాటికి వాడతారు) ఈ NP ప్రొటీన్ ఆరోగ్య కణాల మీద అటాచ్ కావడాన్ని అడ్డుకుంటుంది.
ఇది ప్రయోగశాలలో నిర్వహించిన టెస్టులు, రోగుల నమూనాల్లో ధృవీకరించబడింది. అంటే, ఈ మందు NP ప్రొటీన్‌కు అడ్డుగోడలా పనిచేసి రోగ నిరోధక వ్యవస్థ తప్పుగా ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేయకుండా అడ్డుకుంటుంది.
Covid-19 virus : ఈ పరిశోధన వల్ల కలిగే ప్రయోజనాలు
ఈ పరిశోధన కోవిడ్‌కు సంబంధించిన రోగ నిరోధక సమస్యల నివారణకు కొత్త మార్గాలను ఈ అధ్యయనం సూచిస్తోంది.
ముఖ్యంగా లాంగ్ కోవిడ్, తీవ్రమైన లక్షణాలున్న రోగులకు ఇలాంటి ఔషధాల ద్వారా చికిత్స చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
Covid-19 virus : కలవర పెడుతున్న కొత్త వేరియంట్
ఇంతలో మరో కొత్త కోవిడ్ వేరియంట్ NB.1.8.1 కూడా అనేక దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది ఒమిక్రాన్ వంశానికి చెందినదే. ఇది మొదటిగా 2025 జనవరిలో గుర్తించబడింది. ఇప్పటి వరకు ఇది భారత్, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, చైనా, మాల్దీవులు,ఈజిప్టు దేశాల్లో కలకలం సృష్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వేరియంట్‌ను “Variant Under Monitoring” గా గుర్తించింది. అంటే ఇది ప్రమాదకరమైన స్థాయికి ఇంకా రాకపోయినా దీని వేగంగా వ్యాప్తి అనుమానాలకు తావిస్తోంది.
Covid-19 virus : జాగ్రత్తలు పాటించాల
ఈ తాజా పరిశోధనల ద్వారా మనకు రెండు స్పష్టమైన విషయాలు అర్థం అవుతున్నాయి. కోవిడ్‌కు సంబంధించి మన శరీర రోగ నిరోధక వ్యవస్థే అప్పుడప్పుడు తప్పుడు స్పందన చూపించి ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ తప్పుడు దాడుల్ని అడ్డుకునే ఔషధాలపై పరిశోధనలు జరగడం మంచి పరిణామం. కోవిడ్ ఇంకా పూర్తిగా వెళ్లిపోలేదు. కొత్త వేరియంట్లు వస్తున్నాయి. అందుకే జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఇలాంటి శాస్త్రీయ పరిశోధనలు మన భవిష్యత్‌కు ఆరోగ్య భద్రతను కలిగిస్తాయి.