Daily Calories intake : రాత్రి భోజనంలో జాగ్రత్తలు పాటించకుంటే ఆరోగ్యానికి హానికరమని అంటున్నారు నిపుణులు. డిన్నర్‌ను ఎంత లైట్‌గా తీసుకుంటే అంత మంచిదంటున్నారు. సాయంత్రంం 5 గంటల తర్వాత 45 శాతం కన్నా ఎక్కువ క్యాలరీలు (Daily Calorie intake) తీసుకుంటే ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. వయసు పైబడిన వారు, ప్రీ డయాబెటిస్ లేదా పోస్ట్ డయాబెటిస్ ఉన్న వారు ఈ విషయంలో మరీ జాగ్రత్త పాటించాలని వెల్లడైంది. రాత్రి భోజనంలో 45 శాతం కంటే ఎక్కువ క్యాలరీల భోజనం తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు (Sugar Levels) పెరిగి డయాబెటిస్ తీవ్రతను ఎదుర్కోవాల్సి వస్తోందని ఈ స్టడీలో తేలింది.
షుగర్ లేవల్స్ పెరిగితే..
రక్తంలో చక్కర స్థాయిలను సరిగా నియంత్రించకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ (Type 2 Diabetes) వచ్చే అవకాశాలు ఉంటాయని, గుండె సంబంధిత సమస్యలు, దీర్ఘకాలిక అలర్జీలు ఎక్కువవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి భోజనం స్వల్పంగా తీసుకోవాలని, అందులో తక్కువ మోతాదులో కార్పోహైడ్రేట్స్ ఉండాలని అంటున్నారు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలని, స్వీట్లు, డెసర్టులకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. సరైన ఆహారంతోపాటే నాణ్యమైన నిద్ర కూడా అవసరమని అంటున్నారు. ఆకలిని నియంత్రించడం, రక్తంలోని చక్కెర స్థాయిలను సర్దుబాటు చేయడంలో నాణ్యమైన నిద్ర దోహదపడుతుందని తెలిపారు.
ఆహారం కొవ్వుగా మారకుండా..
యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నేట్ వుడ్ మాట్లాడుతూ రాత్రి తిన్న ఆహారం శరీరానికి వెంటనే ఉపయోగపడదని, దీంతో అది కొవ్వుగా మారి నిల్వ ఉండిపోతుందని తెలిపారు. అందుకే రాత్రి సమయంలో ఎంత తక్కువ క్యాలరీలు తీసుకుంటే అంత మంచిదని సూచిస్తున్నారు. పిజ్జాలు, బర్గర్లు తిని వెంటనే నిద్రకు ఉపక్రమిస్తే శరీరానికి ఆ శక్తి ఉపయోగపడకపోవడంతో కొవ్వుగా నిల్వ అవుతుందని ఆయన వివరించారు. అందుకే భోజనం సాధ్యమైనంత త్వరగా, స్వల్పంగా తినడం మంచిదని అంటున్నారు.
నాణ్యమైన నిద్ర.. మెటబాలిజం
పగటి సమయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 లేదా 5 గంటల వరకు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడం మెరుగైన మెటబాలిజానికి (Metabolism) అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పారు.
నాణ్యమైన నిద్ర మెటబాలిజంపై మంచి ప్రభావం చూపుతుంది. రోజూ రాత్రి సమయంలో 7-8 గంటలపాటు నిద్రపోవాలి. నిద్రలో లెప్టిన్ అనే హార్మోన్ స్రవించడం వల్ల ఆకలి తగ్గుతుంది. 6 గంటల కంటే తక్కువ నిద్రతో ఆకలి మరింత పెరుగుతుంది. అందుకే… ప్రతి రోజూ సమయానికి నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.
రాత్రి భోజనం ఎలా ఉండాలి?
డిన్న అనేది తేలికగా ఉండాలి.
కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. డెసర్టులు, ఆల్కహాల్, మాంసాహారాన్ని తగ్గించడం మంచిది. ఈ నియమాలు రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించడంలో సహాయపడుతుంది.
Daily Calories intake.. తీసుకోవాల్సినవి…
ఆకుకూరలతో కూడిన సలాడ్.
కోడిగుడ్లు, చికెన్, లేదా చేప వంటి ప్రోటీన్.
ఆలివ్ ఆయిల్ లేదా అవకాడో వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు