Diabetic Peripheral Neuropathy : డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఏమిటో తెలుసా? మీలో కొందరు దీని గురించి విని ఉంటారు. మరికొందరికి తెలియకపోవచ్చు. ఇదొక శారీరక రుగ్మత. రక్తంలో షుగర్ పెరిగినప్పుడు ఇది ( Diabetic Peripheral Neuropathy ) సంభవిస్తుంది. దీనినే సంక్షిప్తంగా డీపీఎన్ (DPN) అని కూడా అంటారు. డయాబెటిక్ పెషేంట్స్‌లో ఎక్కువ మంది దీని బారిన పడతారు. తద్వారా మరిన్ని ఆరోగ్య సమస్యలకు గురవుతారు. సకాలంలో దీనిని గుర్తించి చికిత్సపొందితే దీని నుంచి ఉపశనం పొందొచ్చని అంటున్నారు వైద్య నిపుణులు.
Diabetic Peripheral Neuropathy ఎందుకు వస్తుంది?
మధుమేహంతో బాధపడేవారిలో సాధారణంగా కనిపించే సమస్యల్లో డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి (DPN) ప్రధానమైనది. మెదడు, వెన్నుముక వెలుపల ఉండే నరాల (Peripheral Nerves)పై ఇది ప్రభావం చూపుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువై నరాలు దెబ్బతినడం దీనికి ముఖ్య కారణం.
లక్షణాలు (symptoms diabetic peripheral neuropathy)

శరీరంలో స్పర్శ తగ్గుతుంది:
డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి రుగ్మత ఉన్నవారికి
శరీరంలో స్పర్శ తగ్గుతుంది. లేదా పూర్తిగా ఉండదు. సాధారణంగా చేతి వేళ్లతో మొదలై
పాదాల వరకు ఇది పాకుతుంది.
చిమ్మట లేదా మంట :
శరీరంలో సూది గుచ్చినట్టు లేదా మంట ఉంటుంది. ముఖ్యంగా పాదాల్లో ఈ సమస్య ఉంటుంది.
షాక్ కొట్టినట్టు అనిపించడం :
పలు శరీర భాగాల్లో.. ముఖ్యంగా పాదాల్లో తీవ్రనొప్పి ఉంటుంది. లేదా కరెంటు షాక్ కొట్టినట్టు నొప్పి ఉంటుంది. అప్పుడప్పుడు స్పర్శ లేకుండా పోవడం లాంటి సమస్య ఉంటుంది.
అనుభూతిని కోల్పోవడం:
నొప్పి ఉన్నప్పుడు గానీ, ఒత్తిడి, రాపిడి కలిగినప్పుడు గానీ ఎలాంటి స్పర్శలేకపోవడం ఉంటుంది. ఈ సమస్య అనేది గాయాల తీవ్రతను పెంచి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.
కండరాల వీక్‌నెస్: నడిచేటప్పుడు లేదా నిల్చున్నప్పుడు బలహీనంగా అనిపించడం, బ్యాలెన్స్ అవుట్ కావడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. కండరాలు దెబ్బతిని ఇది సంభవిస్తుంది.
పాద గాయాలు:
గాయాలను గుర్తించకపోవడం లేదా రక్త ప్రసరణ తగ్గడం వల్ల పాదాలకు పండ్లు ఏర్పడతాయి.
Diabetic Peripheral Neuropathy ఎందువల్లనంటే..
- ఎక్కువ కాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది.
- నరాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలకు దెబ్బతినడం వల్ల కూడా సంభవిస్తుంది.
- నరాల పనితీరుకు నేరుగా నష్టం కలిగిప్పుడు…
- నర టిష్యూలో ఆక్సిడేటివ్ స్ట్రెస్, ప్రొటీన్ల దెబ్బతినడం వల్ల ఈ రుగ్మత వస్తుంది.
తీవ్ర దాల్చడానికి కారణాలు
- రక్తంలో చక్కెర నియంత్రణ లోపం
- మధుమేహం ఎక్కువ కాలం ఉండటం
- అధిక రక్తపోటు
- అధిక కొలెస్ట్రాల్
- పొగ తాగే అలవాటు.
- అధిక బరువు లేదా స్థూలకాయం
నిర్ధారణ
డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతిని డాక్టర్లు నిర్ధారిస్తారు. రోగ చరిత్ర, లక్షణాలను పరిగణనలోకి తీసుకుంటారు. శారీరక స్పర్శ, రిఫ్లెక్సులు, పాదాలను పరీక్షిస్తారు.
ప్రత్యేక టెస్టులు
- సందేహాస్పద పరిస్థితుల్లో నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తారు.
- లేదా ఎలక్ట్రోమయోగ్రఫీ (EMG) పరీక్షలు చేస్తారు.
చికిత్స
షుగర్ కంట్రోల్ :
Diabetic Peripheral Neuropathyని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోయినా, దాని పురోగతిని నియంత్రించడం, లక్షణాలను నిర్వహించడం సాధ్యమే. ఇందుకు షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుతూ మందులు తీసుకుంటూ ఉండాలి.
జీవనశైలి మార్పులు:
- రక్త ప్రసరణను మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుండాలి.
- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి.
- పొగ తాగే అలవాటును మానుకోవాలి.
పాద సంరక్షణ:
- పాదాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.
- సరైన చెప్పులు ధరిస్తూ గాయాలను నివారించుకోవాలి.
సమస్య తీవ్రమైతే..
- డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి సరైన నియంత్రణ లేకపోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి.
-
-
క్రానిక్ నొప్పి ఉంటుంది.
- పాదాలకు పుండ్లు,
గాయాలు ఏర్పడతాయి. - తీవ్ర సంక్రమణలు లేదా గ్యాంగ్రీన్ వల్ల పాదాలను తొలగించాల్సిన పరిస్థితి వస్తుంది.
డీపీఏతో ఇతర వ్యాధులు
డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి (Diabetic Peripheral Neuropathy )ఉన్న వారు ఇతర రుగ్మతల బారిన పడొచ్చని అంటోంది అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA). అవేమిటంటే…
- విషపదార్థాల ప్రభావం (టాక్సిన్స్)
- మూత్రపిండ వ్యాధి (రెనల్ డిసీజ్)
- హైపోథైరాయిడిజం (థైరాయిడ్ తక్కువగా పనిచేయడం)
- విటమిన్ లోపాలు
- సంక్రమణలు (ఇన్ఫెక్షన్స్)
- క్యాన్సర్ సంబంధిత వ్యాధులు (మెలిగ్నెన్సీ)
- వారసత్వ న్యూరోపతిలు
- వాస్కులిటిస్ (రక్త నాళాల వాపు)
వీటిని గుర్తించి సరైన చికిత్సను తీసుకోవాలని ఏడీఏ సూచిస్తోంది.
మరేం చేయాలి?
- డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతిని సకాలంలో గుర్తిస్తే సమర్థంగా నియంత్రించొచ్చు.
- వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ ఉండాలి.
- జీవనశైలిలో మార్పు కూడా ఈ రుగ్మత తీవ్రతను తగ్గించుకోవడానికి దోహదపడుతుంది.