Guillain-Barré Syndrome | విజృంభిస్తున్న మ‌రో వ్యాధి : Be Alert

Guillain-Barré Syndrome

Guillain-Barré Syndrome  : భారతదేశం ఇప్పటికే అనేక మహమ్మారులతో పోరాడుతూ వచ్చింది. తాజాగా మరో వ్యాధి ఇక్క‌డి ప్రజల‌ను కలవరపరుస్తోంది. గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barré Syndrome) అనే ఈ మహమ్మారి మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో తన ప్రభావాన్ని చూపుతోంది.

Guillain-Barré Syndrome
Symbolic Image

భారతదేశంలో Guillain-Barré Syndrome మొదటి కేసు

ఈ వ్యాధి లక్షణాలతో ఇప్పటికే ఒకరు మరణించగా, ఇది భారతదేశంలో నమోదైన తొలి కేసు. అయితే ఈ వ్యాధి ప్రభావం ఇంకా ఇతర రాష్ట్రాలకు వ్యాపించకపోవడం కొంతవరకు సానుకూల విషయమే. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు గులియన్-బారే సిండ్రోమ్ లక్షణాలు కనిపించలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Guillain-Barré Syndrome అంటే ఏమిటి?

గులియన్-బారే సిండ్రోమ్ (GBS) అనేది ఒక అరుదైన వ్యాధి. ఇది రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నరాలకు ముప్పు కలిగిస్తుంది. సాధారణంగా కలుషిత ఆహారం లేదా నీటిలో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ప్రభావం మన శరీరంలో మోటార్ నరాల (motor nerves) మీద ఎక్కువగా ఉంటుంది. ఇది పక్షవాతాన్ని, నరాల బలహీనతను కలిగిస్తుంది.

 

Guillain-Barré Syndrome
Symbolic Image

 

Guillain-Barré Syndrome లక్షణాలు

  • నరాల బలహీనత

ఇది సాధారణంగా చేతులు, కాళ్లలో మొదలవుతుంది. దీంతో రోగులు శరీర భాగాలను కదలించడంలో ఇబ్బందులు పడతారు.

  • పక్షవాతం

నరాలు పూర్తిగా పని చేయకుండా చ‌చ్చ‌ప‌డిపోతాయి. పక్షవాతం వ‌స్తుంది. ఇది శరీరంలోని ఎటువంటి భాగానికైనా ప్రభావం చూపొచ్చు.

  • శ్వాస సమస్యలు

కొంతమంది రోగుల శ్వాసలో ఇబ్బందులు రావచ్చు. ఇది చాలా తీవ్రమైన పరిస్థితిని సృష్టించొచ్చు.

  • వెన్నునొప్పి, కండరాల నొప్పి

చాలా మంది రోగులు తీవ్రమైన వెన్నునొప్పి లేదా కండరాల నొప్పితో బాధపడతారు.

  • ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం

    రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం వంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. నర్వస్ సిస్టమ్ మీద తీవ్ర ప్రభావం ప‌డుతుంది.

  • Guillain-Barré Syndrome
    Symbolic Image

రోగ నిర్ధారణ విధానం

    గులియన్-బారే సిండ్రోమ్‌ను నిర్ధారించేందుకు వైద్యులు వివిధ పద్ధతులు అనుసరిస్తారు

లక్షణాల పరిశీలన : రోగి చెప్పిన లక్షణాలను గమనించి వైద్యులు ముందుగా అందుకు తగిన పరీక్షలు సూచిస్తారు.

ఎలక్ట్రోమయోగ్రఫీ (EMG): నరాలు, కండరాల మధ్య విద్యుత్ సంకేతాలను పరీక్షిస్తారు.

నరాల వెనుక ఉన్న ద్రవం పరీక్ష : నరాల ప‌నితీరును తెలుసుకోవ‌డానికి ఈ ప‌రీక్ష చేస్తారు.

గులియన్-బారే సిండ్రోమ్ ఎలా వ్యాప్తి చెందుతుంది?

గులియన్-బారే సిండ్రోమ్ సాధారణంగా కలుషిత ఆహారం లేదా నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థకు ప్రమాదం కలిగించే బ్యాక్టీరియాతో కలిగే వ్యాధి. క్యాంపిలోబాక్టర్ జుజుని (Campylobacter jejuni) అనే బ్యాక్టీరియా ఈ వ్యాధికి ప్రధాన కారణం.

Guillain-Barré Syndrome
Symbolic Image

Guillain-Barré Syndrome.. చికిత్సా విధానం

గులియన్-బారే సిండ్రోమ్‌తో బాధపడుతున్న రోగులకు తగినంత మందులు, చికిత్సలు అందించడం అవసరం.

1. ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ (IVIG) : – రోగనిరోధక వ్యవస్థను సమతుల్యం చేయడానికి ఉపయోగించే అత్యంత సాధారణమైన చికిత్సా విధానం.

2. ప్లాస్మా ఎక్స్చేంజ్ (Plasma Exchange) : రోగనిరోధక వ్యవస్థలోని దుష్ప్రభావాలను తగ్గించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.

3. శ్వాస సహాయక‌ పద్ధతులు: తీవ్రమైన శ్వాస సమస్యలు ఎదుర్కొనే రోగులకు వెంటిలేటర్ సహాయాన్ని అందిస్తారు.

జాగ్రత్తలు తీసుకోవడం అవసరం

మన తెలుగు రాష్ట్రాల్లో గులియన్-బారే సిండ్రోమ్ ఇప్పటి వరకు నమోదు కాలేదని చెప్పినప్పటికీ, అప్రమత్తంగా ఉండడం అత్యవసరం. కొన్ని సూచనలను పాటించడం వల్ల ప్రాథమిక స్థాయిలో వ్యాధిని నివారించొచ్చు.

  • స్వచ్ఛమైన, తాజా ఆహారాన్ని మాత్రమే తినండి.
  • స్వ‌చ్ఛ‌మైన నీటిని తాగాలి.
  • వైరస్‌లు, బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా పరిశుభ్రతపై దృష్టి పెట్టండి.
  • బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి.

భ‌యాందోళ‌న‌లు వ‌ద్దు

గులియన్-బారే సిండ్రోమ్ అనేది అరుదుగా కనిపించే గంభీరమైన వ్యాధి. కానీ ముందుగానే లక్షణాలను గుర్తించి, తగిన వైద్య సాయాన్ని పొందడం ద్వారా ఆరోగ్యాన్ని తిరిగి సాధించొచ్చు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం ద్వారా ఇలాంటి మహమ్మారులను అధిగమించొచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి

READ more  సోరియాసిస్... కొన్ని అపోహలు, మ‌రికొన్ని నిజాలు | Psoriasis

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *