Healthy Eating | ఆహారంతో దీర్ఘాయుష్షు

Healthy eating

Healthy Eating : కొంతమంది ఎక్కువ కాలం జీవిస్తారు. దీర్ఘాయుష్షును పొందుతారు. పండు ముస‌లి వారైనా త‌మ ప‌ని తాము చేసుకుంటూ ఎలాంటి రోగాలు లేకుండా బ‌తికేస్తుంటారు. వారిలా ఎక్క‌వ కాలం జీవించ‌డానికి కార‌ణాలు ఏమిటి? అదెలా సాధ్య‌మ‌నే ప్ర‌శ్న‌లు వ‌చ్చిన‌ప్పుడు పాత‌కాల‌పు మనుషులు కాబ‌ట్టి అనే స‌మాధానం ట‌క్కున వ‌చ్చేస్తుంది. ఒక‌ప్పుడు వారు తిన్న తిండే ఇప్పుడు వారిని ఎక్కువ కాలం జీవించేలా చేస్తోంద‌ని అనేస్తాం. నిజ‌మే.. ప్ర‌త్యేక జీవ‌న‌శైలి, ఆహార నియ‌మాలు పాటించ‌డం వ‌ల్లే వారిలా దీర్ఘాయుష్షు పొందుతారు.

ఆహారంతో జీవిత‌కాలం పెరుగుతుందా?

ఉపవాసాలు పాటించడం, మితాహార ప్రాముఖ్యతను నేర్పించడం వంటి ఆచారాలను అనేక సంస్కృతులు, మతాలు ప్రోత్సహిస్తుంటాయి. ఈ ఆచ‌ర‌ణ‌లు ఆధ్యాత్మికంగానే కాకుండా మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతూ జీవిత కాలాన్ని పెంచుతాయని చెబుతుంటాయి. ఇదే న‌మ్మ‌కం నేటి త‌రంలో ఉన్నా పూర్వికుల్లో మ‌రింత బ‌లంగా ఉండేది. త‌క్కువ తిన‌డం వ‌ల్ల ఎక్కువ కాలం జీవించ‌గ‌లుగుతామ‌ని పాత‌కాల‌పు మ‌నుషులు చాలా మంది భావిస్తుంటారు. దీంతో దీర్షాయుష్షును పొంది వంద ఏళ్ల‌కు పైగా బ‌తికేస్తుంటారు. అయితే.. ఆధునిక విజ్ఞానం కూడా ఇదే చెబుతోంది.

అధ్య‌య‌నాలు ఏమంటున్నాయి?

త‌క్కువ తింటే ఎక్కువ కాలం జీవించొచ్చ‌ని అనేక అధ్య‌యానాల్లో నిరూప‌ణ అయ్యింది. అయితే.. త‌క్కువ ఆహారం, దీర్ఘాయుష్షు మ‌ధ్య ఉన్న సంబంధాన్ని తేల్చ‌డం సంక్లిష్ట‌మ‌ని కూడా కొన్ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కొన్ని పరిస్థితుల్లో మాత్రమే తక్కువ కేల‌రీల ఆహారం ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌మ‌ని మ‌రికొన్ని అధ్య‌య‌నాలు తేల్చాయి. ముఖ్యంగా స్థూల‌కాయం లేదా దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్న వారికి మాత్ర‌మే మితాహారం మంచిద‌ని అంటున్నాయి. సాధార‌ణంగా త‌క్కువ ఆహారం తీసుకుంటే పోష‌కాలు లోపించి ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే ప్ర‌మాదం ఉంటుంద‌ని అంటున్నారు నిపుణులు.

ఆహారం.. ఆరోగ్యం.. జీవిత‌కాలం

ఆరోగ్యకర జీవితం గడపడానికి సమతులాహారం ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే. అయితే, ఆహారం పరిమాణం కూడా మన ఆయుష్షుపై ప్రభావం చూపుతుందా? అనే అంశంపై చేసిన ఓ అధ్య‌య‌నంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. మన ఆహారం మన ఆరోగ్యం, శారీర‌క శక్తిపై మాత్రమే కాకుండా మన జీవితకాలంపై కూడా ప్రభావం చూపుతుంద‌ని తేలింది. దీర్ఘాయుష్షుకు ఆరోగ్యకరమైన ఆహారం కీలకమ‌ని అధ్య‌య‌న‌కారులు నిర్ధారించారు. తక్కువ ఆహారం తినడం మాత్రమే ఆయుష్షు పెంచే మార్గం కాద‌ని, – సమతులాహారం తీసుకోవడమే ముఖ్య‌మ‌ని వెల్ల‌డించారు. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. ప‌రిమితికి మించి స‌మ‌తులాహారం తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్షును పొందొచ్చ‌ని అంటున్నారు.

Healthy eating ఎలా పాటించాలి?

పండ్లు, కూరగాయలు :

ఇవి శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి, శరీర కణాలకు రక్షణ కల్పించి వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తాయి.

READ more  Keys to Healthy Living | పండంటి ఆరోగ్యానికి ప‌ద‌హారు సూత్రాలు

సమగ్ర ధాన్యాలు :

ఈ ధాన్యాలు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి.

తక్కువ కొవ్వు కలిగిన ప్రోటీన్:

చికెన్, చేప, పప్పు వంటివి శరీరం, ఎముకల ఆరోగ్యానికి కీలకం.

ఆరోగ్యకరమైన కొవ్వులు:

ఆలివ్ ఆయిల్, గింజలు, విత్తనాలు గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి.

చక్కెర, ప్రాసెస్‌డ్ ఫుడ్ తగ్గించ‌డం :

ఇవి శరీరానికి హానికర రసాయనాలు, మంటలను పెంచుతాయి.

తగినన్ని నీళ్లు తాగడం :

 

శరీరం హైడ్రేట్‌గా ఉండటానికి, టాక్సిన్స్‌ను తొలగించడానికి నీరు కీలకం. రోజూ అధిక పరిమాణంలో నీరు తాగడం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

ఇది కూడా చ‌ద‌వండి

Healthy eating

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *