Heart Attack : యువతలో హార్ట్ అటాక్, పశ్చవాతం లాంటి ప్రాణాంతక వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నా వైద్య పరిశోధనల్లో భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. యువతలో హార్ట్ అటాక్ లేదా పశ్చవాతం రావడానికి తీపి పదార్థాలు అమితంగా తీసుకోవడమే కారణమని ఓ అధ్యయనంలో తేలింది. ఇలాంటి పదార్థాల వల్ల ఈ వ్యాధుల రిస్కును పెరుగుతోందని అంటున్నారు నిపుణులు.
యువతలో హార్ట్ అటాక్ (Heart Attack in Young People).. తీపి పదార్థాలు
స్వీడన్‌లోని లీవండ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఓ అధ్యయనాన్ని చేశారు. సుమారు 70 వేల మంది ఆహార అలవాట్లను, జీవనశైలిని 12 ఏళ్లపాటు పరిశీలించారు. 1997 నుంచి 2009 మధ్యకాలంలో ఈ వివరాలు సేకరించారు. వారి ఆరోగ్య స్థితి 2019 నాటికి ఎలా ఉందో పరిశీలించారు. వచ్చిన ఫలితాలను విశ్లేషించుకోగా యువతలో తీపి పదార్థాలు తీసుకోవడం, తీపి పానీయాలు తాగడం లాంటి అలవాట్లుఉ అనర్థదాయమని తేలింది. ముఖ్యంగా ఇవి గుండె జబ్బులు, పక్షవాతానికి కారణమవుతాయని వెల్లడైంది.
ఎలాంటివి అంటే..
- తీపి పానీయాలు (సోడాలు, ఫ్రూట్ జ్యూస్‌లు)
- బేకరీ ఉత్పత్తులు (పేస్ట్రి, కేక్స్)
- టీ లేదా కాఫీ వంటి పానీయాలకు చక్కెర లేదా తేనె జోడించడం
Heart Attack ఎందుకు హానికరమంటే..
చక్కెరను ద్రవరూపంలో తీసుకుంటే శరీరం చాలా వేగంగా గ్రహిస్తుందని పరిశోధకులు అంటున్నారు.
ఘన ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర విడుదలను నెమ్మదిగా చేస్తాయి. తీపి పానీయాల్లో ఈ రక్షణ లేకపోవడం వల్ల రక్తప్రవాహంలో చక్కెర తక్షణమే పెరుగుతుంది.
ఇది ఆకలిని పెంచుతుంది. తద్వారా మనం మరింత క్యాలరీలను తీసుకునే ప్రమాదం ఉంటుంది.
మరేం చేయాలి?
చక్కెరను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని పరిశోధనలు అంటున్నాయి. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. మిఠాయిలను రుచి కోసం తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చని సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో తీపి పానీయాల స్థానంలో ఆరోగ్యకరమైన పానీయాలు, తక్కువ చక్కెర పదార్థాలను తీసుకోవడం మంచిదని అంటున్నారు. అయితే.. లీవండ్ యూనివర్సిటీ చేసిన ఈ అధ్యయనం పలు పరిమితులు కలిగి ఉంది. తీపి పానీయాలు, ఇతర ఆహారాల దుష్ప్రభావాల పై మరింత పరిశోధన అవసరం ఉందని తెలుస్తోంది.
ఆరోగ్యంగా ఉండాలంటే..
మన ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులతోనే పెద్ద ప్రమాదాలను తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, తీపి పానీయాలకు బదులుగా నీరు లేదా ఇతర ప్రకృతిసిద్ధమైన పానీయాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాం. తీవ్రమైన కేసుల్లో వైద్య సహాయం తీసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ టెస్టులు (కోలెస్ట్రాల్ టెస్టులు), రక్తపోటు, ఇతర హార్ట్ రిలేటెడ్ టెస్టులను పిరియాడిక్‌గా చేయించుకోవడం మంచిది.
తీపి పానీయాల వినియోగాన్ని నియంత్రించడం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించడం, వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలితో గుండెను రక్షించడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు.