Keys to Healthy Living : ఆరోగ్యంగా ఉంటమనేతి నిత్య ప్రయాణం. గమ్యాన్ని ఒకసారి చేరుకుంటే అక్కడే ఆపేస్తామనేది కాదు. ఎప్పటికీ అనుసరిస్తూనే ఉండాలి. జీవన గమనంలో నిరంతరం ఆరోగ్యంగా (Keys to Healthy Living ) ఉండేందుకు జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. ప్రయాణంలో ఎలాంటి నియమాలు పాటిస్తామో… అంతకంటే ఎక్కువగా అనుసరించాలి. కొన్ని సూత్రాలను (Health Tips) తప్పనిసరి చేసుకోవాలి. అప్పుడే మన జీవితం ఆరోగ్యంగానూ, సుఖమయంగానూ సాగుతుంది.
ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి
ఆరోగ్యంగా ఉండటానికి పాటించాల్సిన ముఖ్యమైన 16 నియమాలు ఉన్నాయి. అవేవి కఠినమైనవేమీ కాదు.. చాలా సులభమైనవే. మీరు ఈజీగా చేయగలిగినవే. ఈ చిన్న నియమాలే మీ జీవితాన్ని (Healthy Lifestyle) ఆరోగ్యకరంగా మారుస్తాయి.
Keys to Good Health.. అవేమిటంటే..
1. సైంధవ లవణం వాడండి
ఆహారంలో సాధారణ ఉప్పు బదులు సైంధవ లవణాన్నివినియోగించండి. రక్తపోటు (Blood Pressure)ను ఇది నియంత్రిస్తుంది. శరీరంలోని అవయవంలోనైనా నీటి నిల్వలు పేరుకుపోకుండా ఇది కాపాడుతుంది. ఆరోగ్యానికి నెమ్మనెమ్మదిగా నష్టం కలిగించే వైట్ సాల్ట్ (White Salt) కంటే సైంధవ లవణం ఎంతో శ్రేష్ఠమైనది.
2. మెట్లపై నడవండి
రాత్రి భోజనం (డిన్నర్) తర్వాత మెట్లు ఎక్కుతూ దిగుతూ సాధన చేయాలి. కనీసం ఇలా 500 సార్లు నడవాలి. దీంతో బరువు తగ్గుతారు. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు దూరమవుతాయి. గాఢమైన నిద్రపడుతుంది.
3. భోజనం తర్వాత నీరు తాగకండి
భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో మనం నీళ్లు (Water) తాగుతూ ఉంటాం. అయిపోగానే గటగట లాగించేస్తాం. అలా చేస్తే జీర్ణశక్తి బలహీనమవుతుంది. శరీర బరువు పెరుగుతుంది. భోజనానికి (Meals) 30 నిమిషాల (అరగంట) తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి. భోజనం చేసే సమయంలో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం కొద్ది మోతాదు మాత్రమే తీసుకోవాలి.
4. రోజుకు ఎంత నీళ్లు తాగాలంటే..
రోజుకు కనీసం 3-4 లీటర్ల నీళ్లు తాగాలి. దీంతో శరీరంలోని హానికరమైన టాక్సిన్లు (Taxins) బయటకు వెళ్తాయి. మూత్రపిండ సమస్యలు నివారించబడతాయి. జలబద్ధత సమస్యలు తగ్గుతాయి.
5. గోరువెచ్చని నీటిని తాగండి
గోరువెచ్చని నీటి తాగండి. ముఖ్యంగా పొద్దున్నే నిద్ర లేవగానే ఇది పాటిస్తే చాలా మంచిది. దీంతో శరీరంలో డిటాక్సిఫికేషన్ (Detaxination) జరుగుతుంది. లోపలున్న మలినాలు బయటకు వెళ్తాయి. కంటి చూపు మెరుగవుతుంది.
6. రీఫైన్డ్ ఆయిల్ వాడొద్దు
వంటల్లో రీఫైన్డ్ (Refinde Oil) ఆయిల్ వాడటం చాలా ప్రమాదకరం. దీని బదులుగా నెయ్యి లేదా, కొబ్బరి నూనె, సన్‌ఫ్లవర్, నువ్వుల నూనెలాంటివి వాడాలి.
7. ఇవి తీసుకుంటే ఉత్తమం
బొప్పాయి, టమోటా, క్యారెట్ వంటి రంగు పండ్లు, కూరగాయలు తినడం వల్ల విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. శరీరానికి అన్ని రకాల న్యూట్రియెంట్లు లభిస్తాయి.
8. వైట్ ఫుడ్‌లను మానండి
వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ రైస్ (White Rice) వంటి ఆహారాలు వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అవి అధిక కేలరీలతో ఉంటాయి. తక్కువ పోషకాలు కలిగి ఉంటాయి.
9. రాత్రి పెరుగు, రాజ్మా, బియ్యం తినొద్దు
ఇవి రాత్రి వేళల్లో తినడం వల్ల జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. తొందరగా బరువు పెరుగుతారు.
10. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగొద్దు
ఇలా చేయడం వల్ల ఎసిడిటీ వస్తుంది. భోజనం తర్వాత మాత్రమే Tea/Coffee తాగాలి. అది కూడా వెంటే కాకుండా కొద్ది గ్యాప్ ఇవ్వాలి.
11. రాత్రి ఆలస్యంగా తినకండి
రాత్రి సమయంలో ఆహార తీసుకొనేటప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. సాయం కాలమే డిన్నర్‌ను పూర్తి చేయాలి. దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు (Cardiac Problems) రావు.
12. రోజూ ఒక ఆపిల్ తినండి
An apple a day keeps the doctor away అనే సూత్రాన్ని పాటిస్తే నిత్యం ఆరోగ్యంగా ఉంటాం. రోజూ తీసుకొనే ఒక ఆపిల్ డాక్టర్‌ను దూరంగా ఉంచుతుందని ఈ సూత్రం సారంశం.
13. రోజు 10 వేల మెట్లు నడవండి
రోజూ పది వేల మెట్లు నడవడం అలవాటు చేసుకోండి. ఇది కాస్త కష్టమనిపించినా ఈ సాధన చేస్తే మంచిది. దీంతో బరువు తగ్గుతారు. బీపీ, షుగర్ లాంటి సమస్యల నివారణ అవుతుంది.
14. రోజుకో గ్లాస్ నిమ్మరసం తాగండి
దీంతో శరీరం డిటాక్సిఫై అవుతుంది. శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
15. సలాడ్ తినడం అలవాటు చేసుకోండి
భోజనానికి ముందు సలాడ్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. దీంతో షుగర్ కంట్రోల్ అవుతుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ముందే సలాడ్ తీసుకుంటాం కాబట్టి.. భోజనాన్ని మోతాదుకు మించి తినలేం. తద్వారా తక్కువ కేలరీలను తీసుకున్నట్టవుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.
16. నీటిని కూర్చుని తాగండి
నీటిని కూర్చుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. శరీరం డిటాక్సిఫై అవుతుంది.
ఈ 16 నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మంచి జీవనశైలిని కలిగి ఉండవచ్చు. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.