Kidney Problems in Winter: మన కీలక అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. శరీరంలోని వ్యర్థాలను ఇవి తొలగిస్తాయి. రక్తంలోని నీటి స్థాయిని సమతుల్యం చేస్తాయి. కిడ్నీ (Kidney)లను కాపాడుకోవడం అత్యంత ప్రధానం. ఇవి బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా శీతాకాలంలో మన శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో కిడ్నీల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో Kiddneysను కాపాడుకోవడానికి పలు జాగ్రత్తలు అవసరం. ఇవి బాగా పనిచేయాలంటే పలు సూచనలు పాటించాలి.
శీతాకాలంలో కిడ్నీ సమస్యలు
శీతాకాలంలో మన శరీరంలో అనే మార్పులు చోటుచేసుకుంటాయి. సహజంగా ఈ సీజన్‌లో మనం తక్కువ నీళ్లు తాగుతుంటాం. దీంతో డీహైడ్రేషన్‌కు గురవుతాం. తద్వారా శరీర చురుకుదనం తగ్గి కిడ్నీ సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలు వ్యర్థాలను తొలగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. తగిన నీళ్లను తాగితేనే ఇది సాధ్యమవుతుంది.
లేదంటే కిడ్నీలు సరిగా పనిచేయక శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఇవి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
కిడ్నీలో రాళ్లు
చలికాలంలో తక్కువగా దాహం వేయడం వల్ల చాలామంది తగినంత నీరు తాగరు. దీంతో మూత్రంలో ఖనిజాలు (మినరల్స్) చేరి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది.
రక్త ప్రసరణ తగ్గడం
శీతాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. కిడ్నీలకు సరైన రక్తప్రసరణ ప్రక్రియకు ఇది అడ్డంకిగా మారుతుంది. కిడ్నీ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లు
చలికాలంలో నీటి తాగుదల తగ్గడం వల్ల మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తుంది.
కిడ్నీ ఫంక్షన్ తగ్గడం
రక్తప్రసరణ సరిగా లేకపోవడం, ద్రవాలు తగినంతగా ఉండకపోవడం వల్ల కిడ్నీ పనితీరు మందగిస్తుంది. కిడ్నీల ఫంక్షన్ తగ్గి ప్రమాదానికి దారి తీస్తుంది.
బీపీ సంబంధిత సమస్యలు
శీతాకాలంలో అధిక రక్తపోటు (బీపీ) వల్ల కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది.
Kidney Problems in Winter.. ప్రాథమిక లక్షణాలు
- తరచుగా మూత్రం రావడం, లేదా చాలా తక్కువగా రావడం
- మూత్రంలో రక్తం లేదా మసకపట్టిన రంగు కనిపించడం
- నడుము లేదా పక్క భాగంలో నొప్పి ఉండటం
- ముఖం లేదా కాళ్ల ఉబ్బడం
- అలసట, మలబద్ధకం లేదా అపస్మారక స్థతి
మూత్రపిండాలు బాగా పనిచేయాలంటే..
డీహైడ్రేషన్‌ను నివారించుకోవాలి:
శీతాకాలంలో డీహైడ్రేషన్ సమస్య ఏర్పడకుండా కిడ్నీలు బాగా పనిచేయాలంటే తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ప్రోటీన్లు ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. దాహంగా లేనప్పటికీ తగిన మోతాదులో నీళ్లు తాగుతూ ఉండాలి. నీరు కిడ్నీల్లోని విష పదార్థాలు బయటకు పంపిస్తాయి. తద్వారా కిడ్నీల్లో రాళ్లను నివారిస్తుంది.
నీళ్లకు ప్రత్యామ్నాయం:
నీటిని తాగలేకపోతే ప్రత్యామ్నాయ పానీయాలను తీసుకోవాలి. సూప్ లేదా హర్బల్ టీ లాంటివి సేవించాలి. దీంతో శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ స్థాయిని కంట్రోల్ చేయొచ్చు. దీని ద్వారా కిడ్నీలు సరిగా పనిచేసి వ్యర్థాలను సమర్థంగా ఫిల్టర్ చేయగలుగుతాయి.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ఉప్పు, చక్కెర తగ్గించాలి :
శీతాకాలంలో మూత్రపిండాలు బాగా పనిచేయాలంటే బయటి ఫుడ్‌ను తగ్గించాలి. అధిక ఉప్పు, చక్కెరతో కూడిన ప్రాసెస్డ్ ఆహారాలను అవైడ్ చేయాలి. ఇవి కిడ్నీల ఆరోగ్యానికి హానికరం. వీటిని తగ్గించి, ప్రకృతిసిద్ధమైన ఆహారాన్ని తీసుకోవాలి. పచ్చి ఆకుకూరలు, బెర్రీలు, ఆపిల్, నారింజలను తీసుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఇవి తగ్గిస్తాయి.
ఫైబర్ ఫుడ్ :
ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. తద్వారా కిడ్నీలు చురుగ్గా పనిచేస్తాయి.
శారీరక శ్రమ కోసం..
వ్యాయమం చేయాలి:
శీతాకాలం నిద్రలేమి, నిశ్చలత ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ పనితీరుపై ప్రభావం చూపుతుంది. దీన్ని నివారించడానికి కనీసం రోజుకు 30 నిమిషాలు నడక, యోగా లేదా వ్యాయామం చేయాలి. కిడ్నీలు బాగా పనిచేయాలంటే ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించడమే కాకుండా ఇవి కూడా అత్యంత ముఖ్యమే. రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. ఇది మీ శరీరాన్ని చురుగ్గా ఉంచడమే కాకుండా కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.
Kidney Problems in Winter.. సూచనలు
- రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగాలి
- పొడిబారిన ఆహారాలను అవైడ్ చేయాలి
- కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్ వంటి పానీయాలను తగ్గించాలి
- ఎక్కువగా శాకాహారాన్ని
- శీతాకాలంలో ఏదైనా ఆరోగ్య సమస్య కని తీసుకోవాలి.
చివరికో మాట
మూత్ర పిండాల సమస్య ఉన్నట్టు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ముఖ్యంగా మూత్రంలో మార్పులు, నడుము నొప్పి, అలసట ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. కిడ్నీలు బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మీ ఫ్యామిలీ డాక్టర్ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వైద్యుడిని సంప్రదించండి.
మీ లక్షణాలను స్పష్టంగా వివరించండి. కిడ్నీ సంబంధిత ప్రత్యేక చికిత్స కోసం నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించండి. మూత్ర సంబంధిత సమస్యల కోసం యూరోలజిస్ట్‌ను కలవండి.
డాక్టర్ సూచన మేరకు పరీక్షలు చేయించి మందులు వాడాలి.