Newborn Babycare : బేబీ పుట్టగానే తల్లిదండ్రుల ఆనందానికి హద్దు ఉండదు. వారి ఆలనపాలనలో నిమగ్నమైపోతారు. ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే.. చీమచిటుక్కుమన్నా తట్టుకోలేరు. తమ దైనందిన దినచర్యలో అత్యధిక సమయం వారికే కేటాయిస్తారు. సరిగా కునుకు తీయకుండానే కంటికి రెప్పలా చూసుకుంటారు. నిద్రించకుండా శిశువు ఏడవడం మొదలెట్టగానే బెంబేలెత్తిపోతారు. బేబీని నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తారు. అయినా బిడ్డ శాంతించకుంటే ప్రశాంతను కోల్పోతారు. అయితే.. ఈ పరిస్థితుల్లో పేరెంట్స్ ఏం చేయాలో పలు సూచనలు చేస్తున్నారు నిపుణులు.
నవజాత శిశువులు (Newborn Babies) సాధారణంగా 18 గంటలు నిద్రిస్తారు. ఇందులో 20 శాతం మాత్రమే వీరికి గాఢ నిద్ర పడుతుంది. మిగిలిన సమయంలో అప్పుడప్పుడు లేవడం, ఏడవడమే వీరి పని. తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సేపే నిద్రించినా .. వారిని సరిగా పడుకోనివ్వరు. నిద్రపోతున్నారు గదానీ.. ఒళ్లోంచి తీసి పక్కలో వేయగానే మేల్కోంటారు.. ఏడవడం మొదలెడతారు. సాధారణంగా పగలంతా శిశువులు నిద్రలో ఉంటారు. రాత్రి మేల్కోని ఉంటారు. ఆ సమయంలో పేరెంట్స్ నిద్రపోవలేరు. గర్భస్థ సమయంలో శిశువులు రాత్రిళ్లు చురుగ్గా ఉంటారు. పుట్టిన తర్వాత కూడా ఈ అలవాటు కొంతకాలం కొనసాగుతుంది.
నిద్రించే సమయంలో శిశువులు గంట గంటకూ మేల్కుంటూ ఉంటారు. ఒకసారి నిద్రలోంచి లేచారంటే.. మళ్లీ నిద్రలోకి తొందరగా వెళ్లరు. వారిని నిద్రపుచ్చాలంటే కాస్త శ్రమపడాల్సిందే.
Disturb చేయొద్దు
శిశువుల అవసరాన్ని ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉండాలి. పాలు తాగించడం, దుస్తులు, డ్రైపర్స్ (Drypers) మార్చడం క్రమానుసారం చేస్తూ ఉండాలి. వారు ఆడుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. తల్లిదండ్రులు కూడా ఆసమయంలో వారితో సరదాగా ఉండాలి.
Comfortగా ఉండాలంటే…
పెద్ద మంచాలకంటే శిశువులకు ఊయల (Cradle), జోలె (Hammocks) ఎక్కువ ఇష్టం ఉంటుంది. వాటినే ఉపయోగించాలి. వీరి పక్క బట్టలు పటిష్టంగా ఉండాలి. రగ్గులు, దిండ్లు ఉండొద్దు. ఇవి వారికి కంఫర్ట్ అనిపించవు. మదువైన వస్త్రంతో చుట్టి పడుకోబెడితే హాయిగా నిద్రపోతారు. ఊయలో వేసి తేలికగా ఊగించడమంటే శిశువులకు ఇష్టం. లాలిపాటను పాటను పాడి వీరిని తొందరగా నిద్రపొచ్చొచ్చు. తేలికపాటి మ్యూజిక్, ఫ్యాన్ ధ్వని కూడా ఉపయోగపడుతుంది.
temperature జాగ్రత్త
శుశువులు నిద్రించే గది టెంపరేచర్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ చల్లగా గానీ, వేడిగా గానీ ఉండొద్దు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత ప్రమాదకరం.
Allertగా ఉండాలి
శిశువులు పగటి పూట ఎక్కువ సేపు నిద్రపోతే, రాత్రి తక్కువగా నిద్రిస్తారు. కానీ.. ఎక్కువ సేపు పడుకున్నా బేబీస్ అలసిపోతారు. కాబట్టి నిద్రపుచ్చే విషయంలో కాస్త అప్రమత్తం వ్యవహరించాలి.
Newborn Babycare.. మరికొన్ని
- రాత్రి సమయంలో డ్రైపర్ మార్చడం, పాలివ్వడం లాంటి పనులను చేసేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించాలి. తక్కువ కాంతిలో ఇవి చేయాలి. ఆ టైంలో వారితో మృదువుగానే ముచ్చట్లాడాలి.
- పగటి సమయంలో మాత్రం ఎక్కువ సేపు ముచ్చట్లాడుతూ చురుగ్గా ఉంచాలి. గది కాంతివంతంగా ఉండాలి.నవజాత శిశువులు మంచం మీద వెను
క
భాగంపై పడుకోనివ్వడం మంచిది. పుట్టిన ఆరు నెలల వరకు లేదా సంవత్సరం వరకు ఇలా చేయడం వల్ల వారు సురక్షితంగా ఉంటారు. మృదువైన మంచాలు, దిండు, లేదా బ్లాంకెట్లు ఉపయోగించొద్దు. - గర్భంలో శిశువు ఉన్నప్పుడు లేదా పుట్టిన తర్వాత తల్లి పొగ తాగడం మానేయాలి.
- అధిక ఉష్ణోగ్రత శిశువుకు మంచిది కాదు.
- శిశువును మీ గదిలోనే ఉంచాలి గానీ, మీ మంచం మీద పడుకోబెట్టొద్దు. ఊయల గానీ జోలె గానీ ఉపయోగించడం ఉత్తమం.కారు సీటులో శిశువు ఎక్కువ సేపు నిద్ర పోనివ్వద్దు.
ఒక సంవత్సరం కంటే చిన్నవయస్స గల శిశువుల ఆకస్మిక మరణాన్ని సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ (SIDS) అంటారు. ముఖ్యంగా ఇది నిద్రలో జరుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి నిపుణులు ఈ ఇవన్నీ సూచనలు చేశారు. శిశువు అలవాట్లు మార్చుకోవడానికి మీ సహనంతో పాటు క్రమబద్ధమైన విధానాలు అవసరం. ఏదైనా తీవ్ర సమస్యలు ఎదురైతే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.