olive oil uses : ఆలివ్ ఆయిల్ (olive oil) ను ఆరోగ్యకరమైన నూనెగా ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. ఇది హార్ట్ హెల్త్‌కు మంచిదని, శరీరంలో శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు. అయితే.. తాజాగా ఒక అధ్యయనం విస్తుబోయే వాస్తవాన్ని వెల్లడించింది. ఆలివ్ ఆయిల్ (olive oil) మీద ఉన్న ఈ నమ్మకాన్నిపటాపంచలు చేసింది. ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఓలిక్ యాసిడ్ (Oleic Acid) అనే కొవ్వు ఆమ్లం, శరీరంలో కొవ్వు కణాలు పెరిగేలా చేస్తుందని, ఇది దీర్ఘకాలికంగా తీసుకుంటే స్థూలకాయం (Obesity)కు దారితీయొచ్చని వెల్లడించింది.
olive oil uses: గత అనుభవాలు, ఆరోగ్య ప్రయోజనాలు
నార్త్ అమెరికన్ ఆలివ్ ఆయిల్ అసోసియేషన్ ప్రకారం, 50%కి పైగా అమెరికన్ కుటుంబాలు తమ రోజువారీ వంటల్లో ఆలివ్ ఆయిల్‌ను వాడుతున్నారు. మంచి ఫ్లేవర్‌కు తోడు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుందని దీన్ని వినియోగిస్తుంటారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (National Library of Medicine) పత్రికలో ప్రచురితమైన ఒక పాత అధ్యయనం ప్రకారం ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (anti-inflammatory), హెపటోప్రొటెక్టివ్ (hepatoprotective), రెనోప్రొటెక్టివ్ (renoprotective), యాంటీ న్యూరోడిజెనరేటివ్ (anti-neurodegenerative) గుణాలు కలిగి ఉంటాయి. తద్వారా ఆలివ్ ఆయిల్ మంచి ఆరోగ్య పదార్థంగా గుర్తింపు పొందింది.
olive oil uses : తాజా పరిశోధన ఏమంటోంది?
Cell Reports అనే ప్రముఖ మెడికల్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన పరిశోధనలో విస్తుబోయే విషయాలు వెలుగు చూశాయి. ఆలివ్ ఆయిల్‌లో అధికంగా ఉండే ఓలిక్ యాసిడ్‌ను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కణాలు విపరీతంగా ఉత్పత్తి అవుతాయని తేలింది. ఇది గుండె సంబంధిత వ్యాధులు, టైప్-2 డయాబెటిస్, ఇతర మెటబాలిక్ సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని వెల్లడైంది.
ఓలిక్ యాసిడ్ ప్రభావం.. శాస్త్రీయంగా ఎలా పని చేస్తుంది?
ఓలిక్ యాసిడ్, మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్ (Monounsaturated Fat)కు చెందింది. ఇది మంచి కొవ్వు అని భావించబడుతుంది. కానీ అధిక మోతాదులో తీసుకుంటే మంచిది కాదని పరిశోధకులు అంటున్నారు. ఇది AKT2 అనే ప్రొటీన్ల ఉత్పత్తిని పెంచుతుంది. అదే సమయంలో శరీరంలోని కొవ్వు కణాల నియంత్రణకు అవసరమైన LXR అనే ప్రొటీన్లను తగ్గిస్తుంది. ఫలితంగా కొత్త కొవ్వు కణాల ఉత్పత్తి అధికమవుతుంది.
olive oil uses : పరిశోధన ఎలా జరిగింది?
ఈ అధ్యయనం యూనివర్సిటీ ఆఫ్ ఒక్లహోమా కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ మైఖేల్ రూడాల్ఫ్ నేతృత్వంలో జరిగింది. ఆయన బృందం Yale యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. మైళ్లను వివిధ రకాల కొవ్వు ఆమ్లాలతో తినిపించి, వాటి శరీరాలపై కలిగిన ప్రభావాలను విశ్లేషించారు. కొబ్బరినూనె, పీనట్ ఆయిల్, పాలు, పంది మాసం నూనె, సోయా నూనెలతో పోలిస్తే ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఓలిక్ యాసిడ్ ప్రభావం చాలా అధికంగా ఉందని తేలింది.
శాస్త్రవేత్త ఏమంటున్నారు?
డాక్టర్ రూడాల్ఫ్ తెలిపిన ప్రకారం శరీరంలో కొవ్వు కణాలను మిలిటరీ సైనికుల్లా ఊహించొచ్చు. ఓలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు ఈ ‘కొవ్వు సైన్యం’ గణనీయంగా పెరుగుతుంది. దీంతో శరీరం అధిక పోషకాలను నిల్వ చేయగల సామర్థ్యం పెరుగుతుంది. ఇది మొదట్లో మంచిదే కానీ, తరచూ ఇలా జరిగితే స్థూలకాయం వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఆలివ్ ఆయిల్‌ను ఎలా వినియోగించాలి? (olive oil uses)
- మితంగా తీసుకోవాలి : రోజుకు 1-2 టీస్పూన్లలో ఉండే పరిమితిలో మాత్రమే వాడాలి.
- వివిధ నూనెలతో బదిలీ వినియోగం: ఆలివ్ ఆయిల్ మాత్రమే కాకుండా కొబ్బరినూనె, ఆవ నూనె వంటి ఇతర ఆరోగ్యకర నూనెలను కూడా వాడాలి.
- బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఎక్కువగా ఉన్నవారు ఆలివ్ ఆయిల్ వాడకంపై మరింత జాగ్రత్తగా ఉండాలి.
- డాక్టర్ సలహా తప్పనిసరి : హార్ట్ డిసీజ్ ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడకూడదు.
మితంగా వాడండి
ఈ అధ్యయనం మనకు ఒక స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తుంది. ఏదైనా మితంగా తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ ఆరోగ్యకరమైనదే కానీ, అధిక మోతాదులో తీసుకుంటే అది హానికరమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. మితంగా వాడండి. డాక్టర్ సలహా తీసుకోండి. ఆరోగ్యంగా జీవించండి.