Preterm delivery : అమెరికా (US) లో భారతీయ మహిళలు (Indian Women) ముందస్తు ప్రసవాలు చేయించుకుంటున్నారు. తల్లీ బిడ్డల ఆరోగ్యానికి ఇది ప్రమాదకరమని తెలిసినా ఈ Preterm delivery రిస్కు తీసుకుంటున్నారు. నెలలు పూర్తిగా నిండకముందే ఆపరేషన్ల ద్వారా పిల్లలను కనేందుకు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) తీసుకున్న ఓ నిర్ణయమే వీరు ఈ పనిచేయడానికి పురిగొలిపింది.

Preterm delivery ఎందుకు?
2025 ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్న ట్రంప్ విధానం ప్రకారం అమెరికాలో పుట్టిన ప్రతి శిశువుకూ ఇకపై జన్మతః పౌరసత్వం (Birthright US citizenship) లభించదు. తల్లిదండ్రుల్లో కనీసం ఒకరికి అమెరికా పౌరసత్వం ఉండాలి. లేదా గ్రీన్ కార్డు లేదా అమెరికా మిలిటరీ సభ్యత్వం కలిగి ఉండాలి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పుట్టబోయే తమ పిల్లల భవిష్యత్తును రక్షించుకోవాలనే తపనతో భారతీయ గర్భిణులు నెలలు నిండకముందే బలవంత ప్రసవాలు (Preterm delivery)చేయించుకుంటున్నారు.

పౌరసత్వంపై ప్రభావం
అమెరికా (America) ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయ ప్రభావం భారతీయుల (Indians)పై తీవ్రంగా ఉంది. ప్రస్తుతం భారతీయులు సాధారణ వీసా, టూరిస్టు వీసా, లేదా తాత్కాలిక వర్క్ వీసాతో అమెరికాలో నివసిస్తున్నారు. జన్మతః పౌరసత్వం (Birthright US citizenship) తొలగించడంతో వారి పిల్లలకు ఆ దేశంలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు తగ్గిపోనున్నాయి. ఇది తమ కుటుంబ మనుగడపై ప్రభావితం చూపుతుందని అమెరికాలోని భారతీయులు భావిస్తున్నారు.

Preterm delivery ఆరోగ్య సమస్యలు
ముందస్తు ప్రసవాలు తల్లీబిడ్డల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని అంటున్నారు వైద్య నిపుణులు.
- నెలలు నిండక ముందే శిశువులకు జన్మనిస్తే (Preterm delivery) ఊపిరితిత్తుల వికాసం పూర్తికాక వారు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటారు.
- నెలలు నిండని శిశువులు తక్కువ బరువుతో పుడతారు.
- రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల శిశువులు సులభంగా జబ్బుల బారిన పడతారు.
- జీర్ణాశయం పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆహారం జీర్ణం కాక శిశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈ త్యాగం సరి కాదు.. Preterm delivery వద్దు: నిపుణులు
తమ పిల్లలకు మెరుగైన జీవితం అందించాలనే ఆశతో తల్లులు ముందస్తు కాన్పుల (Preterm delivery) ప్రమాదకర నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇది మంచిది కాదని అంటున్నారు వైద్య నిపుణులు. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ముందస్తు ప్రసవాలు తల్లీబిడ్డల జీవితాలను ప్రమాదంలోకి నెట్టుతాయని అంటున్నారు. గర్భధారణ పూర్తయిన తర్వాతే ప్రసవాలు చేయడం మేలని సూచిస్తున్నారు.

అమెరికా జన్మతః పౌరసత్వం వల్ల ప్రయోజనాలు
- ఉన్నతమైన విద్య , మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
- ఆర్థికంగా కుటుంబం స్థిరపడే అవకాశాలు ఉంటాయి.
- అమెరికా పాస్‌పోర్ట్ ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ సౌకర్యం పొందుతారు.
- ట్రంప్ నిర్ణయంతో ఈ ప్రయోజనాలన్నీ కోల్పోతామనే భయంతో భారతీయులు ముందస్తు కాన్పులకు మొగ్గు చూపుతున్నారు.
-
Symbolic Image ఇది కూడా చదవండి