Stem cell therapy : వైద్యరంగంలో ఒక అద్భుతమైన ముందడుగు. మనిషి గుండె మార్పిడి కోసం వేచి ఉండే బాధితులకు ఊరట కలిగించే పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ఓ చిన్న విధానం ద్వారా ఇక నుంచి హృద్రోగుల ప్రాణాలను కాపాడుకోవచ్చు.
శుభవార్త చెప్పిన జర్మనీ శాస్త్రవేత్తలు
అమెరికాలో ప్రతి క్షణం వేల మంది పెద్దలు, వందల మంది చిన్నపిల్లలు ప్రాణాపాయ స్థితిలో గుండె మార్పిడి (Heart transplant) కోసం వేచి చూస్తున్నారు. వీరి నిరీక్షణకు ఆరు నెలలకంటే ఎక్కువ సమయం పడుతోంది. అయితే.. ఈలోపు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు . పిల్లల విషయంలోనైతే ప్రతి ఎనిమిది మందిలో ఒకరు మరణిస్తున్నారు. ఈ క్రమంలో జర్మనీ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త చెప్పారు. స్టెమ్ సెల్ టెక్నాలజీ (Stem cell Therapy) ద్వారా హార్ట్‌ప్యాచ్ (Heart Patch) అనే విధానంతో రోగిని బతికించుకోవచ్చని ప్రకటించారు. గుండె మార్పిడి జరిగే లోపు ఈ హార్ట్‌ప్యాచ్ ద్వారా ఉపశమనం కలిగించొచ్చని అంటున్నారు. అంతేకాదు… ఇది కొన్ని కేసుల్లో శాశ్వతంగా కూడా పనిచేస్తోందని తెలిపారు.
Stem cell therapy : హార్ట్ ప్యాచ్ .. ఓ చిన్న ఆశ
ఈ హార్ట్ ప్యాచ్ (Heart Patch) అంటే గుండెపై కుట్టగలిగే మినీ గుండె కణజాలం. స్టెమ్ సెల్స్ (Stem cell) నుంచి దీన్ని తయారు చేస్తారు. కోలాజెన్ హైడ్రోజెల్ అనే జెల్‌లో స్థిరీకరించి రూపొందిస్తారు. ఒక ప్యాచ్‌లో సుమారు 200 మిలియన్ కార్డియోమయోసైట్ కణాలు ఉంటాయి. ఈ ప్యాచ్‌ను శస్త్రచికిత్స ద్వారా గుండెపై అమర్చవచ్చు. అది కూడా పెద్దగా కోతలు లేకుండానే (మినిమల్లి ఇన్వేసివ్ సర్జరీ) ఈ ప్రక్రియ (Stem cell Therapy) పూర్తవుతుంది.
Stem cell therapy : ప్రయోగం సక్సెస్
ఈ విధానం మొదట రీసస్ మాకాక్ అనే మంకీలపై పరీక్షించారు. 2021లో తొలిసారిగా ఒక 46 సంవత్సరాల మహిళపై ఈ ప్యాచ్ (Stem cell Therapy) అమర్చారు. ఆమెకు కొత్త గుండె దొరికే వరకు ఇది ప్రాణాలను నిలబెట్టింది. ఈ సాంకేతికతను ఇప్పటికే 15 మంది తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ బాధితులపై ప్రయోగించి విజయం సాధించారు. ఇది హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ (Heart transplant)కు ఒక బ్రిడ్జ్‌లా పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు.
హార్ట్ ఫెల్యూర్‌తో పెరుగుతున్న మరణాలు
ప్రపంచంలో సుమారు 50 వేల మంది తుది దశ గుండె వైఫల్యంతో బాధపడుతున్నారు. దాతల సంఖ్య తక్కువగా ఉండటంతో సంవత్సరానికి సగటున 5 వేల ట్రాన్స్‌ప్లాంట్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో 6 మిలియన్లకు పైగా ప్రజలు హార్ట్ ఫెయిల్యూర్ (Stem cell Therapy) తో చనిపోతున్నారు. ఈ సంఖ్య మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ “హార్ట్ ప్యాచ్” (Heart Patch) వంటి పరిష్కారాలు ఎంతో అవసరం.
Stem cell therapy : ఖర్చు ఎంత?
లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో కార్డియాక్ ఫార్మకలజీలో ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్ సియాన్ హార్డింగ్ మాట్లాడుతూ “నేను ఈ ప్యాచ్‌లను స్వయంగా తయారు చేశాను. ఈ టెక్నాలజీ స్కేల్ చేయడం పూర్తిగా సాధ్యం. ఒక మంచి గుణనిల్వ ఉన్న హార్ట్ టిష్యూ ప్యాచ్ (Stem cell Theraphy) తయారు చేయడానికి సుమారుగా 15 వేల డాలర్లు ఖర్చు అవుతుంది. ఇది పెద్దగా ఖరీదైనది కాదు” అన్నారు. ఇదంతా ఒక గుండె మార్పిడి ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువే. అంటే, ఇది పేదలకు కూడా అందుబాటులోకి రావచ్చు అన్న మాట.
ట్రాన్స్‌ప్లాంట్ అవసరం ఉండదా?
ఇప్పటి వరకు ఈ ప్యాచ్‌ల (Heart Patch) ను బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంట్ (Bridge to transplant)గా ఉపయోగించారు. అంటే… గుండె మార్పిడి జరిగే వరకు కాలం గడిపే పరిష్కారమన్న మాట. కానీ భవిష్యత్‌లో ఇది శాశ్వత పరిష్కారంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయితే ఈ ప్యాచ్‌లు గుండె మార్పిడి అవసరాన్ని పూర్తిగా తొలగించగలవా? అనే ప్రశ్నకు సమాధానం దొరకొచ్చు. ఇది గుండె వైఫల్యం ఉన్నవారికే కాదు.. గుండె టిష్యూకు నష్టం వచ్చినవారికీ Stem cell Therapy ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు నిపుణులు.