Sudden Death in women : మహిళల్లో ఆకస్మిక మరణం (Sudden death in women ) రేటు అనేది చాలా తక్కవగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. పురుషులతో పోల్చుకుంటే ఇది అరుదే అంటున్నారు. అయితే.. వ్యక్తిగత జీవనశైలి, శారీరక ఆరోగ్యం, జన్యుపరమైన అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు. మహిళల్లో సడెన్ డెత్ (Sudden death in women) తక్కువగా ఉండటానికి కారణాలపై ఓ బ్రిటిష్ సంస్థ చేసిన అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో మరణాల రేటు తక్కువ. అంటే.. మగాళ్ల కన్నా ఆడవాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారన్న మాట. అయితే.. భారతదేశంలో ఇది వివిధ సామాజిక, ఆర్థిక, ఆరోగ్య సంబంధిత అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రసూతి సమయంలో మహిళల మరణాల రేటు (Maternal Mortality Rate) ఎక్కువగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు సరైన వైద్య సేవలు, పౌష్టికాహారం అందకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
పేదిరకంలో సరైన తిండి దొరక్క మహిళలు అనేక రోగాల బారిన పడి మృతి చెందుతున్నారు. వీటిలో రక్తహీనత (Anemia) అనేది ప్రధానమైనది. మహిళల అనారోగ్యాన్ని చిన్న సమస్యగా భావించడం, సకాలంలో వైద్యం చేయించకపోవడం వల్ల కూడా వీరి మరణాలకు కారణమవుతోంది. మరోవైపు సామాజిక రుగ్మతలు కూడా మహిళల ప్రాణాలు తీస్తున్నాయి. శారీరక, మానసిక వేధింపులు, ఆర్థికపరపమైన ఒత్తిళ్లు వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. ఇవి తప్ప మహిళల్లో ఆకస్మిక మరణాలు మాత్రం చాలా తక్కువ.
ఆయుష్షు Life Expectancy ఎక్కువే..
సాధారణంగా పురుషులకంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు. వీరి ఆయుష్షు (Life Expectancy) ఎక్కువే అంటున్నాయి పరిశోధనలు. రోడ్డు ప్రమాదాలు, మద్యం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, తీవ్ర శారీరక శ్రమ వల్ల పురుషుల్లో మరణాల రేటును పెంచుతుండగా మహిళల్లో ఇలాంటివి చాలా తక్కువేనని చెబుతున్నాయి.
Sudden Death in women రేటు తక్కువ
మహిళల్లో ఆకస్మిక మరణాలు చాలా తక్కువనని అనేక అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. ముఖ్యంగా ఆడవాళ్లు గుండె జబ్బులతో మృతి చెందడం అనేది చాలా అరుదని అంటున్నాయి. గుండెHeart Attack ), గుండె వైఫల్యం ( Heart failure ), కార్డియాక్ అరెస్ట్ (Cardiac arrest) లాంటి ప్రమాదాలు మహిళల్లో ఎక్కువగా ఉండవని పలు సందర్భాల్లో తేలింది.
ఎక్సర్‌సైజ్‌లు లేకుండానే..
మహిళల్లో ఆకస్మిక మరణాలు తక్కువగా ఉండటానికి కారణాలపై పరిశోధకులు ఆసక్తికర విషయాలను కనుగొన్నారు. దైనందిన చర్యల్లో మహిళలు చేసే పనులే వారి ఆయుష్షును పెంచుతుందని తేల్చారు. కుటుంబ అవసరాలు తీర్చేందుకు శ్రమించడం, ఇంట్లో అటు ఇటు తిరగడం, సందర్భానుసారంగా మెట్లు ఎక్కడం.. దిగడం , షాపింగ్ బ్యాగులు మోయడం తదితర దినచర్యలే వారిని కాపాడుతుంటాయని వెల్లడించారు. అంటే.. ఎలాంటి హేవీ ఎక్సర్‌సైజ్‌లు లేకుండానే చిన్నపాటి శారీరక శ్రమ ఆడవారిలో మరణాల రేటును తగ్గిస్తోందట.
గుండె జబ్బులపై పరిశోధన
వ్యాయామం చేయలేని, లేదా ఆసక్తి లేని మహిళలు దైనందిన చర్యల్లో చేసే చిన్నపాటి కార్యకలాపాలు గుండె సంబంధిత ప్రమాదాలను నివారిస్తాయని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రచురించింది.
81,052 మధ్య వయస్కుల డేటాను పరిశీలించగా ఆసక్తికర విషయాన్ని వెల్లడైందని పేర్కొంది. దైనందిన చర్యల్లో భాగంగా చిన్న చిన్న కార్యకలాపాలు చేసే మహిళల్లో గుండెపోటు (హార్ట్ ఎటాక్), గుండె వైఫల్యం (హార్ట్ ఫెల్యూర్), కార్డియాక్ అరెస్ట్ 45 శాతం వరకు తక్కువగా ఉంటాయని వివరించింది.
Sudden death రాకపోవడానికి కారణాలు ఇవే…
మహిళల్లో గుండె సమస్యలు తక్కువగా ఉండి, సడెన్‌డెత్ రాకపోవడానికి కారణాలు ప్రధానంగా శారీరక, హార్మోనల్, జీవనశైలిపై ఆధారపడి ఉంటాయని అధ్యయనకారులు అంటున్నారు. అవేమిటంటే…
ఎస్ట్రోజన్ హార్మోన్:
మహిళల్లో ఉండే ఎస్ట్రోజన్ అనే హార్మోన్ వారి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తనాళాల్లో ఫ్లెక్స్ ఏర్పడకుండా చేస్తుంది. తద్వారా గుండె పదిలంగా ఉంటుంది. కొవ్వు పదార్ధాల (lipid ) స్థాయిలను నియంత్రించి, గుండె జబ్బుల రిస్క్‌ను ఇది తగ్గిస్తుంది. మెనోపాజ్ వరకు దీని ప్రభావం ఉంటుంది.
లైఫ్‌స్టైల్:
చాలామంది మహిళలు ప్రోటీన్, ఫైబర్, ఆహారపు పదార్థాలపై దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగిస్తారు. సాధారణంగా మహిళల్లో పొగతాగే అలవాటు ఉన్న వారు చాలా తక్కువ. మద్యం సేవించే వారు కూడా అరుదే. గుండె సమస్యలను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది.
ఇంటి పనులు:
సాధారణంగా మహిళలు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు. దీని ద్వారా శారీరక శ్రమ చేయాల్సి వస్తుంది. ఇది కూడా గుండెకు పరోక్షంగా మేలు చేస్తుంది.
బీపీ కంట్రోల్:
మహిళల్లో యవ్వన దశలో సాధారణంగా బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది గుండె సంబంధిత రోగాల రిస్క్‌ను తగ్గిస్తుంది. వయసు పెరిగే వరకూ వీరిలో రక్తపోటు సమస్యలు సాధారణంగా ఎక్కువగా కనిపించవు.
శారీక నిర్మాణం
పురుషుల కన్నా మహిళల శారీరక నిర్మాణం భిన్నంగా ఉంటుంది. కొవ్వు నిల్వలు పిరుదులు, తొడల వంటి భాగాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల బ్లాకేజీలకు కారణం కావు కాబట్టి వారిలో గుండె జబ్బులు చాలా తక్కువ.
ఆహారపు అలవాట్లు
భారతదేశ మహిళలు ప్రధానంగా సంప్రదాయ, పోషకాహారాలు తింటారు. తక్కువ నూనె, అధిక కూరగాయలు, పొడి కూరలు తీసుకుంటారు. ఈ అలవాటు గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది.
కాలినడక:
డ్రైవింగ్ కన్నా కాలినడకకే అధిక ప్రధాన్యం ఇచ్చే మహిళల్లో శరీరానికి శరీరానికి అవసరమైన మూలకాలు యాక్టివ్‌గా ఉంటాయి. ఇవి హృద్రోగాలకు దూరంగా ఉంచుతాయి.
చివరికో మాట..
గుండె సంబంధిత సమస్యలు తక్కువగా ఉండే కారణాలు వ్యక్తిగత జీవనశైలి, శారీరక ఆరోగ్యం, జన్యుపరమైన అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయి. అయితే.. వయసు పెరిగే కొద్దీ గుండె సమస్యల రిస్క్ కూడా పెరుగుతుంది. కాబట్టి మహిళలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకొని ప్రమాదం ఉందా.. లేదా? అనేది ఎప్పటికప్పుడు నిర్దారించుకుంటూ ఉండాలి.
Super