Thyroid | రోగాల ఫ్యాక్ట‌రీ థైరాయిడ్‌.. నివార‌ణ సాధ్య‌మేనా?

Thyroid  : థైరాయిడ్ వ్యాధి రోజురోజుకూ విస్త‌రిస్తోంది. హార్మోన్ల అసమ‌తుల్య‌త వ‌ల్ల వ‌చ్చే ఈ రుగ్మ‌త చాలా మందిలో క‌నిపిస్తోంది. అనేక రోగాల‌కు కార‌ణ‌మ‌వుతోంది. వైద్యుల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో చికిత్స తీసుకుంటేనే దీని నియంత్ర‌ణ సాధ్యం.

హార్మోన్ల ఉత్ప‌త్తి కేంద్రం థైరాయిడ్ గ్రంథి (Thyroid gland). మ‌న శ‌రీరానికి కావాల్సిన మెటాబాలిక్ రేటు, జీర్ణ‌క్రియ‌, శారీర‌క వృద్ధి, మెద‌డు కార్యాచ‌ర‌ణ‌, ఎముక‌ల అభివృద్ధిలో దీని పాత్ర ప్ర‌ధానం. మెద‌డులోని పిట్యుట‌రీ గ్రంథి దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఆహారంలో స‌రైన మోతాదులో ఐయోడిన్ ఉంటేనే ఈ థైరాయిడ్ గ్రంథి స‌క్రమంగా ప‌నిచేస్తుంది. లేదంటే నియంత్ర‌ణ కోల్పోయి అనేక రుగ్మ‌త‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంది. హార్మోన్లు స‌మ‌తుల్య‌త దెబ్బ‌తిని రోగాల ఫ్యాక్ట‌రీగా ఈ థైరాయిడ్ గ్రంథి పనిచేస్తుంది.

Close-up of a woman touching her neck, possibly indicating discomfort or throat pain.

థైరాయిడ్ గ్రంథి గొంతు వ‌ద్ద వాయువ్య వాహ‌కం (ట్రాచియా) కింద తాబేలు ఆకారంలో ఉంటుంది. సాధార‌ణంగా బ‌య‌ట‌కు ఇది క‌నిపించ‌దు. వ్యాధి తీవ్ర‌త పెరిగిన‌ప్పుడు ఉబ్బుగా క‌నిపిస్తుంది. దీన్ని సాధార‌ణంగా Goiter అంటారు.

పిట్యుట‌రీ , థైరాయిడ్ గ్రంథుల మ‌ధ్య‌ లింకు ఏమిటంటే…
రక్తంలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలను పిట్యుట‌రీ గ్రంథి (Pituitary gland) నిత్యం ప‌రిశీలించ‌డ‌మే కాకుండా నియంత్రిస్తుంది. శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల ((Thyroid hormones) కొరత ఏర్ప‌డిన‌ప్పుడు గానీ, అధిక‌మైన‌ప్పుడు గానీ టీహెచ్ఎస్‌ (Thyroid stimulating hormone) అనే ప్ర‌త్యేక హార్మోన్‌ను విడుద‌ల చేసి కంట్రోల్ చేస్తుంది.
TSHను థైరాయిడ్ గ్రంథికి పిట్యుటరీ గ్రంథి పంపి త‌ద్వారా స‌మ‌తుల్యాన్ని కోల్పోయిన హార్మోన్ల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని సాధారణంగా క్రియాశీలత లేని ప్రోహార్మోన్ T4గా పిలుస్తారు. అలాగే చాలా క్రియాశీల ప్రోహార్మోన్ అయిన T3ని కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లలో సుమారు 80 శాతం T4, సుమారు 20 శాతం T3 ఉంటుంది. T4ను T3గా మార్చడంలో కాలేయం, కిడ్నీలు కూడా సహాయపడతాయి. అలాగే శ‌రీరంలో కాల్షియం, ఫాస్ఫెట్ స్థాయిల‌ను నియంత్రించే కాల్సిటోనిన్‌ను కూడా థైరాయిడ్ గ్రంథి ఉత్ప‌త్తి చేస్తుంది.

Thyroid  వ‌రికి వ‌స్తుందంటే..
ఐయోడిన్ (Iodine) కొర‌త వ‌ల్ల థైరాయిడ్ గ్రంథిపై ప్ర‌భావం ప‌డుతుంది. ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం ప్ర‌పంచ వ్యాప్తంగా రెండు బిలియ‌న్ల మంది ఐయోడిన్ కొర‌త‌కు గుర‌వుతున్నార‌ని తేలింది. వీరిలో 200 మిలియ‌న్ మంది థైరాయిడ్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నార‌ని వెల్ల‌డైంది. థైరాయిడ్ వ్యాధి ఎవ‌రికైనా రావ‌చ్చు. మ‌హిళ‌ల్లోనే ఈ రుగ్మ‌త ఎక్కువ అని ప‌లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నా పురుషులు, పిల్ల‌ల్లోనూ దీని ప్ర‌భావం క‌నిస్తోంద‌ని మ‌రికొన్ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. పొగ‌తాగే వారు, లిథియానికి సంబంధించి ఉన్న వారు, అధిక మానసిక ఒత్తిడికి గురైన వారు, ఐయోడిన్‌, జింక్‌, సెలీనియంలో కొర‌త ఉన్న‌వారు దీని బారిన ప‌డుతున్నారని తెలుస్తోంది. ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లోనూ ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఉన్నారు. భార‌త్‌, అమెరికా, చైనాలో మాత్రం ఈ వ్యాధిగ్ర‌స్థుల సంఖ్య ఎక్కువ‌. మారుతున్న జీవ‌న‌శైలి నేప‌థ్యంలో అన్ని వ‌య‌సుల వారు థైరాయిడ్‌తో బాధ‌ప‌డుతున్నా 60 ఏళ్ల‌పై బ‌డిన వారిలో దీని ప్ర‌భావం ఎక్కువ క‌నిపిస్తోంద‌ని వైద్య నిపుణులు అంటున్నారు.

READ more  Blood Pressure in Pregnant lady | గ‌ర్భిణులకు బీపీ ఉంటే ఏమ‌వుతుంది?

Thyroid  ల‌క్ష‌ణాలు.. స‌మ‌స్య‌లు
థైరాయిడ్ గ్రంథి ఎక్కువ హార్మోన్లు ఉత్పత్తి చేయ‌డాన్ని హైపర్ థైరాయిడ్ (Hyperthyroid) అంటారు. దీని బారిన ప‌డేవారి గుండె ద‌డ‌, ఆందోళన, మాన‌సిక ఒత్తిడి, అధిక చెమట, బరువు తగ్గడం, Goiter ఏర్పడటం, జుట్టు బ‌ల‌హీన‌ప‌డ‌టం, చర్మ రంగు మారడం..సెన్సిటివిటీ, పీరియ‌డ్ స‌క్ర‌మంగా రాక‌పోవ‌డం త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు.

థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లు ఉత్పత్తి చేయలేకపోవ‌డాన్ని హైపో థైరాయిడ్ (Hypothyroid) అంటారు. దీని బారిన ప‌డితే అలసట, శ‌రీరం చల్లగా ఉండ‌టం, మ‌ల‌బ‌ద్ధ‌కం, చ‌ర్మం పొడిబార‌డం, జుట్టు రాలడం, బ‌రువు పెర‌గ‌డం, హార్ట్ బ్రీత్ మంద‌గించ‌డం, కండ‌రాల నొప్పులు, మాన‌సిక ఒత్తిడి, పీరియ‌డ్స్‌ స‌క్ర‌మంగా రాక‌పోవ‌డం త‌దిత‌ర‌ స‌మ‌స్య‌లను ఎదుర్కొంటారు.

మెనోపాజ్.. థైరాయిడ్‌
మహిళల్లో సాధారణంగా 45-50 వ‌య‌సు మ‌ధ్య మెనోపాజ్ (Menopause) మొదల‌వుతుంది. దీంతో రుతుచ‌క్రం (Periods) ఆగిపోతుంది. మెనోపాజ్ ద‌శ‌లో TSH స్థాయిలు పెరుగుతూ ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోవ‌డంతో మ‌హిళ‌లు హైపర్ థైరాయిడ్‌కు గుర‌వుతారు. పోస్ట్ మేనోపాజ‌ల్ బ్లీడింగ్ కార‌ణంగా యూటరిన్ పాలిప్స్, ఫైబ్రాయిడ్లు, థైరాయిడ్ రోగాలు వ‌స్తాయి. త‌ద్వారా హైపో థైరాయిడ్‌కు కూడా గురికావ‌చ్చు.

Thyroid  నిర్ధార‌ణ‌.. చికిత్స‌

  • Goiter ఉబ్బెత్తుగా క‌నిపించి అనేక అవ‌ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే సాధార‌ణంగా డాక్ట‌ర్లు గుర్తించి చికిత్స చేస్తారు.
  • థైరాయిడ్ ఫంక్ష‌న్ టెస్ట్ (Thyroid Function Test) కూడా సిఫార్సు చేస్తారు. ర‌క్తంలో T3, T4, TSH స్థాయిలను ఇది గుర్తిస్తుంది. దీని ఆధారంగా థైరాయిడ్‌ను నిర్థారిస్తారు.
  • స్కానింగ్ ద్వారా కూడా థైరాయిడ్‌ను నిర్ధారిస్తారు. థైరాయిడ్ సంబంధిత వ్యాధులు, నోడ్యూల్స్‌, క్యాన్స‌ర్ త‌దిత‌ర ప్ర‌మాద‌క‌ర రుగ్మ‌త‌ల‌ను ఇది గుర్తిస్తుంది.
    ఎల్ఎఫ్‌టీఎస్, ఆర్‌ఎఫ్‌టీఎస్, సీబీసీ, ఈఎస్‌ఆర్ త‌దిత‌ర బేస్‌లైన్ టెస్టులు అవ‌ర‌మైతే వైద్యులు వాటిని కూడా సిఫార్సు చేస్తారు.
    ఒక సరిగా నిర్ధారించి త‌ర్వాత రోగం తీవ్రత, మోతాదు, చికిత్స కాలం ఆధారంగా వైద్యులు మందులు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో జీవితాంతం మందులు తీసుకోవాల్సి ఉంటుంది.

మ‌రేం చేయాలి?

  • సమతుల్య ఆహారం తీసుకోవాలి.
    ఐయోడిన్ క‌లిగిన‌ ప‌దార్థాలు తీసుకోవాలి. అయితే.. ఐయోడిన్ అధికమైనా, త‌క్క‌వైనా హానికరమే.
  • సీఫుడ్స్, చేపలు, ఐయోడినేటెడ్ సాల్ట్, సెలీనియం రిచ్ పుడ్ ఎక్కువ‌గా వాడుతూనే ఉండాలి.
  • ప్రాసెస్ చేసిన ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేదా ప్రిసర్వేటివ్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవ‌ద్దు.
  • స్వీట్స్, అధిక కొవ్వు ఉన్న ఆహారాలను తగ్గించాలి
  • వ్యాయామాలు, యోగాతోపాటు శ‌రీరానికి కొంత ప‌నిచెప్పే ఇత‌ర యాక్టివిటీస్‌ను అల‌వాటు చేసుకోవాలి.
  • స‌రైన నిద్ర తీసుకోవాలి. పర్యావరణ కాలుష్యానికి దూరంగా ఉండాలి.
  • ప్రతి ఆరు నెలలకోసారి లేదా సంవ‌త్స‌రానికి ఒక‌సారైనా (అవ‌స‌రాన్నిబ‌ట్టి) వైద్య పరీక్ష చేయించుకోవాలి.
  • ముఖ్యంగా డాక్ట‌ర్ సూచన‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి
READ more  Cancer Vaccine | క్యాన్స‌ర్ వ్యాక్సిన్ వ‌చ్చేస్తోందోచ్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *